తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈనెల 22న జరగగా...  నేడు ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది.80 నియోజకవర్గాల్లో 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అధికారులు ప్రారంభించారు. మొత్తంగా 12 వేలకు పైగా అభ్యర్థులు ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తారు. కాగా ఈ అభ్యర్థులందరి భవితవ్యం ఏమిటో నేడు తేలిపోనుంది. ఇక పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్ ప్రారంభించారు అధికారులు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 

 

 

 ఇక ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో అని అభ్యర్థులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే అన్ని చోట్ల అధికార టీఆర్ఎస్ పార్టీ ముందంజలో దూసుకుపోతుంది. కానీ ఒక్క చోట మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీకి బిజెపి భారీ షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే గతంలో పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కి షాక్ ఇచ్చి  విజయం సాధించిన బిజెపి... మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బైంసా ప్రాంతంలో బిజెపి పార్టీ ముందంజలో కొనసాగుతోంది. టిఆర్ఎస్ పార్టీ అసలు ఎక్కడ మెజారిటీ లేకుండా పోయింది. 

 

 

 బైంసా లోని మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 14 ఉండగా అనూహ్యంగా బిజెపికి 8, ఎంఐఎం 3,  కాంగ్రెస్కు 1,  ఇతరులకు 1 ముందంజలో ఉండి దూసుకుపోతున్నాయి. కాగా  బిజెపికి మెజారిటీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బైంసా ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి బిజెపి మరోసారి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. టిఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం  కి కూడా 3 చోట్ల ముందంజలో ఉంది... కానీ టిఆర్ఎస్ మాత్రం ఎక్కడ ముందంజలో లేకపోవడం గమనార్హం. భైంసాలో జరిగిన అల్లర్లు మున్సిపల్ ఎన్నికలపై భారీగా ప్రభావం చూపిన స్పష్టంగా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: