ఈరోజు ఉదయం 8 గంటలకు కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరికాసేపట్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 9 కార్పొరేషన్లకు, 120 మున్సిపాలిటీలకు ఈ నెల 22వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఓట్లు సమానంగా వస్తే లాటరీ పద్దతిలో అభ్యర్థి విజయాన్ని నిర్ణయించనున్నారు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 
 
మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక ఈ నెల 27వ తేదీన జరగనుంది. కార్పొరేషన్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తొలి బోణీ చేసింది. జవహర్ నగర్ కార్పొరేషన్ ను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని చాలా చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. వర్ధన్నపేట మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ హవా మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 
 
మొదటి రెండు గంటల్లోనే చాలా చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. డోర్నకల్ 11వ వార్డు, హుజూర్ నగర్ మున్సిపాలిటీలలో 2 వార్డులు, అందోల్ లోని 2 వార్డులలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. సూర్యాపేటలోని 5,13, 17 వార్డులు , హుస్నాబాద్ లో 2 వార్డులు, ఆదిభట్లలోని 5వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు బొల్లారంలో ఘన విజయం సాధించారు. 
 
కొత్తపల్లిలోని 7,12 వార్డులలో జోగిపేటలోని 9, 11 వార్డులలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. 120 మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే అనేక చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. పలు చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ ముందంజలో ఉంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీని సైతం టీఆర్‌ఎస్‌ పార్టీ సొంతం చేసుకుంది. ఛైర్మన్ పదవికి అవసరమైన స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే సొంతం చేసుకుంది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: