కేసీఆర్.. తెలంగాణ బెబ్బులిగా పేరున్న నాయకుడు. అలాంటి నాయకుడు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మరింతగా ఎదిగారు. అసలు తెలంగాణలో మరే పార్టీ కూడా నిలదొక్కుకోలేనంతగా అన్ని విషయాల్లోనూ ఆధిపత్యం కనబరిచారు. తెలంగాణలో అసలు ప్రతిపక్షం అంటే ఏంటీ అని వెదుక్కోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కేసీఆర్ ను సైతం ధిక్కరించి మాట్లాడగల నేతగా పేరు తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి.

 

టీడీపీలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్ అంటే ఒంటి కాలి పై లేచే రేవంత్ రెడ్డి మాటల తూటాలు పేలుస్తాడు.. వయస్సులో కాస్త చిన్నవాడే అయినా రేవంత్ రెడ్డికి కూడా మంచి ఫాలోయింగే ఉంది. తెలంగాణా యాసలో మాంచి వాగ్దాటితో మాట్లాడే రేవంత్ రెడ్డి అంటే యూత్ కూడా ఫాలోయింగ్ ఉంది. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చాడు కేసీఆర్.

 

రేవంత్ రెడ్డి సొంత సామ్రాజ్యంగా పేరున్న కోడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించాడు. రేవంత్ కు వాయిస్ లేకుండా చేసేశాడు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. మల్కాజ్ గిరిలో పోటీకి దిగిన రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఓడించలేకపోయాడు. ఎమ్మెల్యేగా ఓడినా.. ఎంపీగా గెలిచి మరోసారి రేవంత్ రెడ్డి హీరో అయ్యాడు. ఇక ఆ తర్వాత జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నికలు ఈ మున్సిపాలిటీ ఎన్నికలే.

 

ఈ ఎన్నికల్లో తన నియోజకవర్గం కొండగల్ లో మరోసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటమి రుచి చూపించి సత్తా చాటాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. కానీ కేసీఆర్ చాణక్యం ముందు రేవంత్ పప్పులేమీ ఉడికినట్టు లేవు. కొడంగల్ పురపాలకంలోనూ టీఆర్ఎస్ గెలుపు దాదాపు ఖాయమైపోయింది. దీంతో మరోసారి రేవంత్ రెడ్డి కేసీఆర్ చేతిలో ఘోర పరాజయం పాలైనట్టే కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హీరోగా మారిన రేవంత్ రెడ్డినికి కేటీఆర్ మరోసారి జీరో చేసినట్టే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: