చైనా దేశం వణికిపోతోంది. కరోనా వైరస్ తాజాగా బయటపడటంతో చైనా దేశానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఒక మనిషి నుండి మరొక మనిషికి అంటువ్యాధిలా వ్యాప్తి చెందే ఈ వైరస్ ప్రస్తుతం చైనా దేశంలో చాలా మందికి సోకినట్లు చైనా ప్రభుత్వం గుర్తించింది. ఈ వ్యాధి సోకిన వాళ్ళు ఇతర దేశాల్లో కూడా ఉన్నట్లు గుర్తించింది. దీంతో ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని విమానాశ్రయాల్లో సదరు దేశానికి చెందిన ప్రభుత్వాలు ఎక్కడికక్కడ కరోనా వైరస్ దేశములలో రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం చైనాతోపాటూ థాయ్‌ల్యాండ్, దక్షిణ కొరియా, వియత్నాం, ఫ్రాన్స్, సింగపూర్, తైవాన్, నేపాల్, అమెరికా, జపాన్, సౌదీ అరేబియా, హాంగ్ కాంగ్ దేశాల్లో ఈ వైరస్ విస్తరించినట్లు గుర్తించారు.

 

అయితే ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆరు రకాల వైరస్ లు మనిషి శరీరం లోకి వచ్చిన తర్వాత ఆ వైరస్ డైరెక్టుగా మనిషిలో ఉన్న ఊపిరితితులపై ప్రభావం చూపి సరిగ్గా మనిషి ఊపిరి పీల్చుకో లేకుండా ఉండేవిధంగా న్యుమోనియా వ్యాధి టైపు శరీరంలో ప్రబలుతు శరీరంలో ఒక చోట కుదురుగా ఈ వైరస్ ఉండకుండా ఉంటుందట. అయితే ముందుగా సదరు వైరస్ సోకిన వ్యక్తికి జ్వరం వస్తుందట...క్రమంగా ఒక వారం తర్వాత ఒక్కో లక్షణం బయటపడుతూ ఉంటుందట.

 

పొడి దగ్గు వస్తూ ఉంటుంది. ఒక వారం తర్వత ఊపిరి సరిగా ఆడదు. ముక్కుకి ఏదో అడ్డు పడుతున్న ఫీలింగ్ ఉంటుంది. వ్యాధి వచ్చిన వారు అందరూ చనిపోయే అవకాశం లేదు. వచ్చిన నలుగురిలో ఒకరు మాత్రమే చనిపోతారు. అయితే చనిపోయే వరకు దగ్గుతూనే ఉంటారు. క్రమంగా ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా చైనా దేశంలో మాత్రమే ఉన్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. దీంతో ప్రపంచంలో చైనా దేశంతో సత్సంబంధాలు కలిగిన దేశాలు ఈ వైరస్ గురించి తెలుసుకున్న తర్వాత ఆ దేశంతో సత్సంబంధాలు రాకపోకలను నిలిపివేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: