తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ తమ జోరు చూపిస్తుండగా ఆదిలాబాద్ జిల్లాలోని బైంసా మున్సిపాలిటీ లో మాత్రం కారు కాస్త వెనకబడినట్టు కనిపిస్తోంది. ఇక్కడ ఎంఐఎం, బీజేపీ పార్టీలు  నేనా అన్నట్టుగాతలపడుతున్నాయి. గతంలో ఈ మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా అదేవిధంగా ఫలితాలు వచ్చేటట్టుగా ఉండడంతో మిగతా పార్టీలు నిరాశలో కూరుకుపోయాయి. భైంసాలో మాత్రం టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. అక్కడ టీఆర్ఎస్ ప్రభావం కనిపించలేదు. కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే.

 

రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉన్నా బైంసా ఫలితాలు ఎలా ఉంటాయో అనే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కొద్ది నెలల క్రితం బైంసా లో నెలకొన్న అల్లర్ల కారణంగా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఆసక్తిగా మారింది. భైంసా మున్సిపాలిటీ పరిధి లో 23 వార్డులకు గాను, 85 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పార్టీల వారీగా చూసుకుంటే టీఅర్‌ఎస్‌ అభ్యర్థులు 23 వార్డులలో, ఎంఐఎం అభ్యర్థులు 18 వార్డులలో, బీజేపీ అభ్యర్థులు 13 వార్డులలో, కాంగ్రెస్‌ అభ్యర్థులు 16వార్డుల లో, స్వతంత్రులు 15 వార్డులలో పోటీలో ఉన్నారు. భైంసాలో 7 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలిస్తే, 6 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. భైంసాలో పోరు హోరా హోరీగా ఉంది. బీజేపీ ఎంఐఎం మధ్య గట్టి పోటీ నెలకొంది. అక్కడ గెలుపుని ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.


 గెలుపు మాది అంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరికొద్ది గంటల్లో కానీ పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం కనిపించడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో జోరు చూపిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ బైంసాలో పుంజుకోకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది. మొదటి నుంచి ఇక్కడ ఎంఐఎం తన హవా చూపిస్తుండగా ఇప్పుడు బీజేపీ కాస్త బలం పుంజుకుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వెనకబడి ఉండగా టీఆర్ఎస్ తన జోరు కొనసాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: