చిత్తూరు జిల్లా పుత్తురులో  వైసీపీ ఎమ్మెల్యేకి తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వ విప్‌, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి  కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహ‌నం బోల్తా ప‌డింది. చెవిరెడ్డి త‌న ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీ  స‌మావేశాలు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఆయ‌న ఆ స‌మావేశాలు ముగించుకుని సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన చంద్ర‌గిరికి వెళ్లారు. చంద్ర‌గిరిలో ఆయ‌న పనులు కంప్లీట్ చేసుకుని చెన్నై వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో సిబ్బందికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ‌వారిని అక్క‌డ తిరుప‌తిలోని స‌మీపంలో ఉన్న ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 

 

ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం ప్రమాద సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ కారుకి ముందు వాహనంలో ఆయ‌న  ఉన్నారు. చెవిరెడ్డి కాన్వాయ్ బోల్తా పడ‌డంతో ఆక్కడ స్థానికులంతా ఉలిక్కిప‌డ్డారు.  ద‌గ్గ‌ర‌లో ఉన్న స్థానికులు తెలుసుకున్నారు. వెంట‌నే వారు అక్క‌డు చేరుకుని సాయం చేయ‌డంతో పాటు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాహనాన్ని పక్కకు తీసి వారిని వెంట‌నే ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులన్ని దగ్గరుండి ఆస్పత్రికి తరలించే వరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్క‌డ దగ్గరే ఉన్నారు. 

 

గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. వాహనం బోల్తాపడటంతో ఆ మార్గంలో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు ఆటంకం నిలిచింది. తర్వాత పోలీసులు స్థానికులతో కలిసి వాహనాన్ని పక్కకు తీయడంతో మళ్లీ వాహనాల రాకపోకలు మాములుగా జరిగాయి. దీంతో కంగారు ప‌డ్డ ఆయ‌న కుటుంబ స‌భ్యులు అంద‌రూ క‌లిసి అంతా ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయ‌న‌కు ఏమీ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక అటు చెవిరెడ్డి ఎస్కార్ట్ వాహ‌నం బోల్తా ప‌డ‌డంతో ఈ విష‌యం తెలిసిన ప‌లువురు కీల‌క నేత‌లు, వైసీపీ ఎమ్మెల్యేలు సైతం ఆయ‌న‌కు ఫోన్ చేసి ఏం జ‌రిగింద‌న్న విష‌యం ఆరా తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: