ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలలో సంబరాలు మొదలైపోయాయి. మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపు 120 మున్సిపాలిటీలలో 90 టిఆర్ఎస్ సభ్యులు ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణ భవన్ లో అంతా సంబరాలు చేసుకుంటున్నారు చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాటిలో పాల్గొనగా పశు సంరక్షణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ సాధించిన విజయానికి ఐటీ మంత్రి మరియు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని అన్నారు.

 

తలసాని మాట్లాడుతూఇతర పార్టీలకు హైకమాండ్ న్యూఢిల్లీలో ఉంటుంది ఏమో కానీ మాకు మాత్రం తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని చెప్పారు. ఇక కేటీఆర్ యొక్క నాయకత్వం గురించి మాట్లాడుతూ మిగతా నాయకుల లా కాకుండా కేటీఆర్ తనంత తానే విస్తృతంగా ప్రజలను కలిసి మరియు వారి నమ్మకాన్ని పొందారని ఆయన అన్నారు. చాలా ప్రాంతాల్లో అతనే దగ్గర ఉండి ప్రజల ఆదరణ ఎలా పొందాలో తెలుసుకొని అందులో విజయవంతం అయ్యారని కూడా తలసాని చెప్పుకొచ్చారు.

 

ఇక పోతే 5 నుంచి 24 రౌండ్లలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుమొదలవగా పోస్టల్ ఓట్లు, తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరిగింది. సమాన ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో విజేత ప్రకటిస్తారు. 27 పరోక్ష పద్ధతిలో మేయర్, ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక జరుగుతుంది.

 

ఇప్పుడు ఎన్నికల ఫలితాలు కేటీఆర్ యొక్క సమర్ధతకు పరీక్షగా టిఆర్ఎస్ నాయకులతో పాటు తెలంగాణ ప్రజలు అంతా భావిస్తున్నారు. అతను ఇందులో తిరుగులేని విజయాన్ని సాధించారు కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లోనే కేటీఆర్ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా చూడబోయే అవకాశం ఉందని అటు టిఆర్ఎస్ పార్టీ వర్గాలు మరియు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: