వరుస విజయాలతో దూసుకుపోతూ ఓటమి ఎరుగని దర్శకుడు తనదైన స్టైల్ సినిమాలను తెరకెక్కించే ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించి... అనిల్ రావిపూడి సినిమా వస్తుందంటే ఫుల్ టైం ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించి వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. దర్శకులు అందరికి ఒక పంథా  అయితే అనిల్ రావిపూడిది  మాత్రం మరో పంథా  సినిమా ని  చూడడానికి వచ్చిన ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించి... అబ్బా ఏముంది రా సినిమా అని అనుకునేలా చేయడం అనిల్ రావిపూడి లక్ష్యం. అందుకే ఏ హీరోతో సినిమా తెరకెక్కించిన ఆ  సినిమా లో ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్నట్టుగా ఉంటాయి. 

 

 

 ప్రస్తుతం ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలను ఎక్కువగా ఆదరిస్తుస్తుండంతో... అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రాలని భారీ విజయాలు గా మారుతున్నాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీసే అవకాశం దక్కించుకుని సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే మరో సంచలన విజయాన్ని తగ్గించుకున్నారు అనిల్ రావిపూడి. ఒక సినిమా నుంచి మరో సినిమాను హిట్ చేస్తూ రికార్డులు నమోదు చేసుకున్నాడు. ఇక  తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 

 

 

 ఈ సందర్భంగా తనకు తొలిసారిగా అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గురించి ప్రస్తావించాడు అనిల్ రావిపూడి. తాను పటాస్ కథను సిద్ధం చేసుకుని హీరోల చుట్టూ నిర్మాతల చుట్టూ తిరుగుతున్న సమయంలో.... తనకు ఎవరూ అవకాశం ఇవ్వలేదు అంటూ తెలిపాడు అనిల్ రావిపూడి. అలాంటి పరిస్థితుల్లో తాను హీరో కళ్యాణ్ రామ్ ని కలిసి కథ వినిపించగానే... కళ్యాణ్ రామ్  ఈ కథకు ఓకే చెప్పారూ . కానీ అప్పటికే ఓం ఇలాంటి సినిమాకు నిర్మాతగా వ్యవహరించి  దెబ్బతినడం వల్ల తన బ్యానర్లో సినిమా చేయలేనని చెప్పారూ  కళ్యాణ్ . ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసి నిర్మాతల కోసం తిరిగాం . ఇక ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరికి కళ్యాణ్ రామ్ రిస్క్  తీసుకు చేసుకుని మరీ పటాస్ సినిమాను నిర్మించారు అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఆరోజు కళ్యాణ్ రామ్ గారు ధైర్యం చేసి నా కథ  ఓకే చేసి నిర్మాతగా కూడా వ్యవహరించడం వల్లే ఈరోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: