జగన్మోహన్ రెడ్డి-చంద్రబాబునాయుడు మధ్య రాయబారాలు మొదలైనట్లు సమాచారం. ఈ రాయబారానికి ప్రధాన కారణమేమిటంటే శాసనమండలి రద్ద అంశమే కావటం గమనార్హం.  అసెంబ్లీలో ఆమోదం పొందిన  రెండు ప్రధాన బిల్లుల విషయంలో  మండలిలో తెలుగుదేశంపార్టీ ఎంత కంపు చేసిందో అందరూ చూసిందే.  రెండు రోజుల పాటు రెండు బిల్లులపై ఎటువంటి చర్చ, ఓటింగ్ జరగనీయకుండా నారా రచ్చ చేసిన టిడిపి చివరకు వాటిని సెలక్ట్ కమిటి పరిశీలనకు పంపుతున్నట్లు ఛైర్మన్ ఎంఏ షరీఫ్ తో ప్రకటన చేయించింది.

 

రెండు రోజుల పాటు జరిగిన గొడవ, నిబంధనలను అతిక్రమించి ఛైర్మన్ సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు  మ్యానేజ్  చేయటంలో  టిడిపి శాడిజమే కనిపిస్తోంది.  అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు మండలిలో ఓడిపోతాయని జగన్మోహన్ రెడ్డి, మంత్రులకు తెలుసు. తప్పదు కాబట్టి బిల్లులను మండలికి పంపుతున్నారు. ఇందులో భాగంగానే  రెండు బిల్లులపైన కూడా చర్చ జరిపి ఆమోదించటమో లేకపోతే ఓడించటమో ఏదో ఒకటి చేయమని మంత్రులు టిడిపిని రిక్వెస్ట్ చేసుకున్నారు. అయితే  టిడిపి మాత్రం కావాలనే సెలక్ట్ కమిటి పరిశీలన డిమాండ్ ను తెరపైకి తెచ్చింది.

 

టిడిపి వైఖరితో ఒళ్ళుమండిపోయిన జగన్ అసలు మండలినే రద్దు చేసేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయమై అసెంబ్లీలో కూడా గట్టిగానే తన వాదన వినిపించారు. ఎప్పుడైతే  జగన్ ఆలోచన బయటపడిందో వెంటనే పార్టీల్లో కలకలం మొదలైంది. ముఖ్యంగా టిడిపి, బిజెపి, పిడిఎఫ్ సభ్యుల్లో. అందుకనే బిజెపి, పిడిఎఫ్ సభ్యులు వెంటనే రంగంలోకి దిగారని సమాచారం.

 

మండలి రద్దు కాకుండా ఇటు జగన్ అటు చంద్రబాబుతో చర్చలకు మధ్యవర్తిత్వం మొదలుపెట్టారట.  అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించటమో లేకపోతే ఓటింగ్ లో ఓడించటమే చేసేట్లుగా  మధ్యవర్తులు చంద్రబాబుతో మాట్లాడుతున్నారట. అంటే మళ్ళీ ఏ బిల్లు కూడా సెలక్ట్ కమిటికి పంపేదుండదు. అలాగే  మండలి రద్దు ఆలోచనను విరమించుకునేట్లుగా జగన్ తో కూడా మాట్లాడుతున్నారట. అంతా బాగానే ఉంది కానీ చంద్రబాబు ఒకవేళ హామీ ఇచ్చినా ఇచ్చిన హామీకి కట్టుబడుంటారా ? ఇదే కదా చంద్రబాబులో అసలు సమస్య.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: