ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ లో టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఇప్పటికే వారి విజయం ఖరారు కావడంతో కేసీఆర్ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర భవనం ముందు ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా సన్నాహాలు షురూ చేశాడు. అయితే తెలంగాణ రాష్ట్ర భవన్ లోని టిఆర్ఎస్ నాయకులు అంతా సంబరాలు చేసుకుంటూ ఉండగా ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ వారికి కొన్ని ఝలక్ లు ఇచ్చింది.

 

ఇంట గెలిచి రచ్చ గెలువు మంటారు పెద్దలు. అయితే విచిత్రంగా రోజు కేసీఆర్ యొక్క టిఆర్ఎస్ పార్టీ తాము ఊహించని నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు సంపాదించి తమ సొంత అడ్డాలో మాత్రం చతికిలపడింది. గజ్వేల్ లో అన్ని వార్డుల్లో క్లీన్ స్వీప్ చేద్దామనుకున్నా అధికార టీఆర్ఎస్ ను ఓటర్ల నిరాశపరిచగా అక్కడ కాంగ్రెస్ మరియు బి.జె.పి లు తమ సత్తాని చాటారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ కావడంతో దానిపై అందరి దృష్టి నెలకొంది.  అలాంటి చోట కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక సిరిసిల్ల‌లో కేటీఆర్ ఇలాకాలో 10 మంది ఇండిపెండెంట్లు గెలిస్తే ఇక్క‌డ కూడా అలాగే జ‌రిగింది..

 

ఇప్పుడు ఎన్నికలకు ముందు అందరి దృష్టిని ఆకర్షించిన అదిలాబాద్ జిల్లాలోని భైంసా ను కూడా ఎంఐఎం ఎగరేసుకొనిపోయింది. మొత్తం భైంసా లో 26 వార్డులు ఉండగా అందులో ఎంఐఎం 15 సాధించగా బిజెపి 9 వార్డులలో గెలుపొంది. ఫలితం అందరూ ముందే ఊహించినది అయినా టిఆర్ఎస్ తమ సొంత నియోజకవర్గాల్లో బోల్తా కొట్టింది కాబట్టి ఇటువంటి చోట్ల అయినా కూడా వారికి కొన్ని సీట్లు లభిస్తాయని వారి పార్టీ వర్గాలు ఆశించగా చివరికి అది కూడా జరగకపోవడం కేసీఆర్ ను కొద్దిగా కలవరపెట్టే విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: