ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోత్కూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.  ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు  నరాలు తెగే  ఉత్కంఠ తో రీ కౌంటింగ్ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు . ఈ వార్డు టీఆరెస్  గెలిస్తే ఆ పార్టీకి చైర్మన్ పదవి దక్కే అవకాశముండగా , కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మాత్రం హంగ్  ఏర్పడనుంది .

 

మొత్తం  12 వార్డులున్న మోత్కురు మున్సిపాలిటీలో టీఆరెస్  ఆరు వార్డుల్లో గెలిచి ఆధిక్యం లో కొనసాగగా ,  కాంగ్రెస్ పార్టీ సైతం తామేమి తక్కువకాదన్నట్లుగా  ఐదు  వార్డులను సొంతం చేసుకుని , అధికార పార్టీ నేతలకు గట్టి షాక్ ఇచ్చింది . అయితే మున్సిపాలిటీ లోని  ఏడో వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఏడో వార్డులో రీ కౌంటింగ్ చేయాలని ఎన్నికల అధికారులను ఇరు పార్టీల అభ్యర్థులు కోరారు . రీ కౌంటింగ్ లోను ఇద్దరికి  సమన ఓట్లు వేస్తే, ఫలితాన్ని టాస్ , డ్రా ద్వారా నిర్ణయించే అవకాశాలున్నాయి .   ఏడవ  వార్డు  ఈ ఫలితాన్ని బట్టి.. మోత్కుర్  మున్సిపల్ పీఠం ఎవరిదన్న విషయం తెలియనుంది.

 

ఒక వేళ ఏడవ  వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే , అప్పుడు చైర్మన్ పీఠం కోసం రెండు పార్టీలు  లాటరీ ఫలితం కోసం ఎదురుచూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు . ఏడవ  వార్డులో ఒక్క ఓటు టీఆర్ఎస్‌కు వ‌స్తే ఆ పార్టీకే వార్డు తోపాటు , మున్సిపల్ చైర్మన్ పీఠం  ద‌క్కేది. మోత్కుర్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుందుకు అధికార పార్టీ నేతలు అప్పుడే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది . ఏడవ  వార్డు గెలిస్తే సరేసరి అని లేకపోతే, కాంగ్రెస్ తరుపున ఒక్కర్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు  సమాచారం . 

మరింత సమాచారం తెలుసుకోండి: