ఒకవైపు కేంద్రంలో విపరీతమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ గత కొద్ది కాలంలోనే తెలంగాణలో గుర్తించదగిన పార్టీ గా ఎదిగింది. దీంతో తెలంగాణలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న టిఆర్ఎస్ పార్టీకి ఇక అడ్డంకులు ఎదురవుతాయి అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి తమ సత్తా ఏంటో నిరూపించుకుంది. కెసిఆర్ ఎన్నికల్లో వచ్చిన షాక్ నుండి కొన్ని రోజులు తర్వాత తేరుకొని చాలా వ్యూహాత్మక రీతిలో తన మంత్రివర్గ మండలిని రూపొందించుకొని లోకల్ ఎన్నికల వైపు విపరీతమైన కసరత్తులు చేశారు.

 

అందులో భాగంగానే కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాలన్న ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇక అంతా వేయికళ్ళతో ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలు రానే వచ్చాయి కేటీఆర్ అంతా తానే దగ్గరుండి వ్యూహాలకి ప్రతివ్యూహాలు వేసి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించేలా కీలకపాత్ర పోషించాడు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మీద అసలు ఎవరికీ నమ్మకాలు లేకపోయినా బిజెపి మాత్రం టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ఒకటి రెండు చోట్ల తప్పితే పార్టీ కూడా తెలంగాణ లో తేలిపోయింది.

 

ఖచ్చితంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కుమిలిపోయిన కమలం రెండే రెండు చోట్ల మాత్రం వికసించింది. ఆమన్గల్ మరియు తుక్కుగూడ ప్రాంతాల్లో మాత్రమే బిజెపి అనూహ్య రీతిలో విజయం సాధించింది. ఆమన్గల్ మహబూబ్ నగర్ జిల్లా కి చెందిన ప్రాంతం కాగా తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా పరిధి లోనికి వస్తుంది. నేటి ఫలితాల ద్వారా టిఆర్ఎస్ తమకు తెలంగాణలో ఎటువంటి ఎదురు లేదని మరోసారి నిరూపించుకోగా చివరికి భారతీయ జనతా పార్టీ వారు ఎక్కడ నుంచి మొదలు పెట్టాడో అక్కడికే వచ్చి ఆగినట్లైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: