చిన్నబాబు చిరుతిండి పేరుతో గతంలో సాక్షిలో వచ్చిన కథనంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అప్పట్లో ఘాటుగా స్పందించారు. ఈ కథనం ద్వారా తన ప్రతిష్టకు భంగం కలిగిందని లోకేష్ భావిస్తున్నారు. ఈ మేరకు సాక్షి దినపత్రికపై 75 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్ 22వ తేదీన సాక్షి లో 'చినబాబు చిరు తిండి 25 లక్షలు అండి అనే పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై అప్పట్లో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ప్రచురించిన ఈ కథనంపై లోకేష్ న్యాయపోరాటం చేస్తానని గతంలోనే సాక్షి యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపించారు.


అసలు కథేంటంటే విశాఖ విమానాశ్రయంలో లోకేష్ చిరు తిండి కోసం 25 లక్షల బిల్లు హోటల్ కు టీడీపీ ప్రభుత్వం చెల్లించండని సాక్షిలో వార్తలు వచ్చాయి. దీనిపై వైసిపి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ కథనం వచ్చినప్పటి నుంచి లోకేష్ అసహనంతో ఉన్నారు. ఇప్పటికే రాజకీయంగా నిలదొక్కుకోలేక పోవడం, సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కోవడం ఇటు వంటి కారణాలతో చాలా కాలంగా మౌనంగా ఉంటున్నారు లోకేష్. ప్రభుత్వంపై పోరాడేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని తన ఎదుగుదలకు ఉపయోగించుకునేందుకు నిత్యం వార్తల్లో వుండే విధంగా లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. 

 

రాజధాని ఉద్యమంలోనూ లోకేష్ ఇదే విధంగా లోకేష్ పోరాడి తన హవా చూపించేందుకు ప్రయత్నం చేసినా అది కుదరలేదు. దీంతో ఇప్పుడు జగన్ ప్రభుత్వం, ఆయన మీడియాకు చెందిన సాక్షిపై పోరాటం చేయడం ద్వారా  ఘాటుగా తనను తాను బలమైన నాయకుడిగా నిరూపించుకునేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే లోకేష్ ప్లాన్ పెద్దగా వర్కవుట్ అయ్యే అవకాశం కనిపించడంలేదు. ఎందుకంటే లోకేష్ సత్తా ఏమిటో ఇప్పటికే పార్టీ నాయకులతో పాటు ప్రజలకు కూడా అర్ధం అవ్వడంతో లోకేష్ ప్రయత్నాలు పెద్దగా ఫలించే అవకాశం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: