తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఘోర పరాజయం దిశగా పయనిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ రికార్డు స్థాయిలో మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటూ దూసుకెళుతోంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మాత్రం రేసులో వెనుకబడ్డాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, డి కె అరుణ, భట్టి విక్రమార్క ఎన్నికల్లో తమ ప్రాంతాలలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 
 
కాంగ్రెస్ సీనియర్ నేత, మల్కాజి గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో 12 వార్డులకు గాను 8 వార్డులు టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో విసృతంగా తిరిగారు. కానీ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర కోటకు కూడా బీటలు పడ్డాయి. 
 
టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం దిశగా దూసుకెళుతూ ఉండటంతో భట్టి విక్రమార్క కు భారీ షాక్ తగిలినట్లయింది. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్ నగర్ లో కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ పార్టీ తరపున గద్వాల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డి కె అరుణ మున్సిపల్ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 
 
రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీ హవానే స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, డి కె అరుణ తాము ప్రాతినిథ్యం వహిస్తున్న మున్సిపాలిటీలలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో ప్రముఖులైన ఈ నేతలు ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో పార్టీలను గెలిపిస్తాం అని చెప్పిన నేతలు ఇప్పుడు ప్రాతినిథ్యం వహిస్తున్న మున్సిపాలిటీలను కూడా గెలిపించుకోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: