అమెరికా ప్రపంచంలోనే అగ్రదేశం.  అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో దూసుకుపోతున్న దేశం.  ఆ దేశానికీ నిత్యం వేలాదిమంది వలస వెళ్తుంటారు.  ఉద్యోగాల పేరుతో ఎక్కువగా వలస వెళ్తుంటారు.  ఇలా వలస వెళ్తున్న వ్యక్తుల్లో ఎక్కువుగా ఆసియా దేశాల నుంచి ఉంటారు.  ఇది వేరే విషయం అనుకోండి.  అమెరికా తన ఆయుధాలను ఎక్కువుగా గల్ఫ్ దేశాలకు అమ్ముతుంటుంది.  ఆ ప్రాంతంలో నిత్యం అలజడిని, భయాన్ని కలిగిస్తూ, ఆయుధాలను అమ్ముకుంటూ ఉంటుంది.  


ఇందులో భాగంగానే అమెరికా ఇరాక్ దేశంలో తిష్ట వేసింది.  అక్కడే ఎయిర్ బేస్ ను ఏర్పాటు చేసుకొని ఇరాన్ ను బెదిరించడం మొదలు పెట్టింది.  ఇరాన్ కు చెందిన ఆర్మీ కమాండర్ ఖాసీం ను అమెరికా డ్రోన్ బాంబులతో హత్య చేసింది.  అప్పటి నుంచి గల్ఫ్ లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  మూడో ప్రపంచ యుద్ధం తప్పదేమో అనే విధంగా పరిస్థితులు మారిపోయాయి.  


అయితే, ఈ పరిస్థితులలో కొన్ని మార్పులు రావాలని శాంతిస్థాపకులు అనుకున్నారు. అయితే, ఖాసీంను ఖననం చేసిన కొన్ని రోజులకు ఇరాన్ ప్రతీకార చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.  ఇరాక్ లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేస్ పై క్షిపణి దాడులు చేసింది.  ఈ దాడుల్లో అమెరికా ఎయిర్ బేస్ చాలా వరకు  దెబ్బతిన్నది.  80 మంది వరకు అమెరికా సైన్యం మరణించినట్టు ఇరాన్ పేర్కొన్నది.  


కానీ, అమెరికా ఆ వార్తలను తప్పు అని ప్రకటించడంతో షాక్ అయ్యారు. దీంతో కొందరు అమెరికా ఎయిర్ బేస్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  బేస్ క్యాంప్ ధ్వంసం అయినా దృశ్యాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. చాలామంది అమెరికన్ సైన్యానికి దెబ్బలు కూడా తగిలాయి.  వారిని జర్మనీ మీదుగా అమెరికాకు పంపి అక్కడ చికిత్స అందిస్తున్నారట.  అమెరికా ఈ విషయంలో అబద్దాలు చెప్పడం ఏంటని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: