తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు అంటే 25 వ తారీఖున శనివారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యంగా అన్నిచోట్ల దాదాపుగా అధికార పార్టీ సీట్లను కైవసం చేసుకోగా. కొన్ని చోట్ల మాత్రం గట్టి పోటి తగిలింది. అంతే కాకుండా ధర్మపురి మునిసిపాలిటీలో మాత్రం నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది.. ఇదే కాకుండా ఓట్ల లెక్కింపులో ఇరు పార్టీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగింది..

 

 

ఇక ఈ మున్సిపాలిటీలో కూడా తమకు ఎదురు లేకుండా విజయాన్ని సాధించాలని ఆశపడ్డ టీఆర్ఎస్ కు కొన్ని చోట్ల ఆశాభంగం కలిగింది. ఇక ఇప్పటి వరకు వార్ వన్ సైడ్ అంటూ, మొత్తం మున్సిపాల్టీల్లో వందకు పైగా కారు ఖాతాలో పడతాయని, తొమ్మిది కార్పోరేషన్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన అధికార పార్టీకి అక్కడక్కడ బ్రేకులు పడ్డాయి.

 

 

ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో పరిస్థితి హోరాహోరీగా ఉంది. ఇక్కడ 8 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా, మరో 7 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇకపోతే ఇప్పుడు అక్కడక్కడా మారిన పరిస్దితులను బట్టి చూస్తే, నిజంగానే ప్రతిపక్షాలు ఆశిస్తున్నట్లు అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం తగ్గుతుందా? గత ఎన్నికల మాదిరిగానే ఆధిక్యం కొనసాగుతుందా ? అనేది ఆస‌క్తిగా మారింది.

 

 

నిజానికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ రికార్డు స్థాయి విజయాలు న‌మోదు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే ఈఎన్నికల ఫలితాల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తామని టీఆర్ఎస్ భావించింది. ఇదిలా ఉండగా గ‌తేడాది జరిగిన మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాల్ని నమోదు చేసింది. మొత్తం 32 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ దక్కించుకోగా, కాంగ్రెస్, బీజేపీ సహా ఏ పార్టీకి ఒక్క జడ్పీ స్థానం కూడా దక్కలేదు. 537 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే, టీఆర్ఎస్ పార్టీ 448 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్ 75 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు దక్కించుకోగలిగాయి.

 

 

ఇక 2018 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ   ఏకపక్ష విజయం సాధించి, రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు , కాంగ్రెస్ 19 ,బిజెపి ఒకటి, ఎంఐఎం 7 స్థానాలు గెలుచు కున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ ...తెలంగాణలో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాంచి, 17 లోక్ సభ స్థానాలకు గానూ.. 9 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ 3 , బిజెపి 4,ఎంఐఎం ఒక్కసీటు గెల్చుకున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: