నేడు దశలవారీగా వెలువడిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దశలోనూ బిజెపికి ఆశాజనకంగా రాలేదు. తాము బలంగా ఉన్నామని అనుకున్న ప్రతిచోటా కమలం పార్టీ దెబ్బ తినింది. వారు లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన స్థానాల్లో కూడా చాలా వాటిలో పట్టుమని పది వార్డులు కూడా ఆధిక్యత లేకపోవడం వారి అహాన్ని గట్టిగా దెబ్బ తీసేదే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేకమేడలా కూలిపోయిన తర్వాత బిజెపి ఒక్కసారిగా ఊపందుకున్న విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ అటువంటి గడ్డు పరిస్థితి విధంగా బెదరకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు. బిజెపి వెన్ను విరిచాడు.

 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీతో చేతులు కలిపిన మోడీ టీం అక్కడ కూడా అంత పెద్ద శక్తిగా ఏమీ ఎదిగే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. అటు చూస్తే జనసేనకు ఒక ఎమ్మెల్యే.... అతను కూడా అసలు పార్టీ అన్నది అర్థంకాని పరిస్థితి. వీరి నాయకుల్లో ఒక్కరు కూడా బలమైన వారు లేరు. అది ఏమన్నా అంటే కేంద్రంలో తమ చక్రం తిప్పుతున్నారు అంటారు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వీరి పరిస్థితి ఒకటే. శూన్యం

 

ప్రస్తుతం తెలంగాణలో వచ్చిన ఫలితం ద్వారా బిజెపి ఆత్మస్థైర్యం గట్టిగా దెబ్బ తింటుంది అటువైపు ఏపీ మూడు రాజధానులు విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలిని రద్దు చేసే విధంగా వ్యూహరచన చేస్తున్న నేపథ్యంలో బిజెపికి ఏం పాలుపోవడం లేదు. ఎక్కడో ఒక చోట తమ ఆధిపత్యం చెలాయించేందుకు కానీ మరియు ఏదైనా విషయాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడంలో కానీ బిజెపి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమవుతోంది. తెలంగాణలో ఇప్పటికే చతికిలపడ్డ పార్టీ రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగే స్థానిక ఎన్నికల్లో కనీస పోటీ చూపించకపోతే ఇక దుకాణం సర్దేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: