అసెంబ్లీ ఆమోదించిన బిల్లుని రిజెక్ట్‌చేశారంటున్న మంత్రులంతా మిడిమిడిజ్ఞానంతో మాట్లాడుతున్నారని, మండలి బిల్లుని ప్రజాభిప్రాయం కోరమని చెప్పింది తప్ప ఎక్కడా దాన్ని తిరస్కరించలేదని యనమల స్పష్టంచేశారు. ఎస్సీకమిషన్‌, ఇంగ్లీషు మీడియం బిల్లుల విషయంలో కూడా ఇలానే తప్పుడు ప్రచారంచేశారన్నారు. వాటిని ముందు ఆర్డినరీ బిల్లులుగా మండలికి పంపారని, ఎస్సీ కమిషన్‌ బిల్లులో బీసీకమిషన్‌ బిల్‌ మాదిరే కేటగిరీలు చేయాలని సూచించామని, ఇంగ్లీషు మీడియం బిల్లులో  తెలుగు బోధనను ఎంపికచేసుకనే స్వేచ్ఛను విద్యార్థులకు ఇవ్వాలని సూచించామన్నారు.   ఆ రెండుబిల్లులను ముందు ఆర్డినరీ బిల్లులుగా మండలికి పంపారని, వాటిని తిప్పిపంపా క తిరిగి పెద్దలసభకు పంపేముందు మనీబిల్లులుగా మార్చారన్నారు. 3రాజధానుల బిల్లు మనీబిల్లా..ఆర్డినరీ బిల్లా అని హైకోర్టుకూడా ప్రశ్నించిందన్నారు.

 

దేశరాజధాని ఏదంటే ఢిల్లీ అని చిన్నపిల్లాడు కూడా చెప్తాడని, రాజ్యాంగంలో కేపిటల్‌ అనేపదం లేకుంటే, ఆర్టికల్‌ 239 (ఏ) ప్రకారం నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ అనేపదం ఎక్కడినుంచి వచ్చిందన్నారు. రాజ్యాంగం గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న వ్యక్తికి దాని గురించి ఏంతెలుసునన్నారు. మామూలు చదువే చదవని వ్యక్తికి, రాజ్యాం గం చదివేంతజ్ఞానం ఎక్కడనుంచి వస్తుందని యనమల ఎద్దేవాచేశారు. తప్పులతప్పులు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఇప్పటికైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తే మంచిదన్నారు. 

 

టీడీపీ హాయాంలో తరచూ దావోస్‌పర్యటనకు వెళ్లి, పెట్టుబడులు రాబట్టామని, ఈప్రభుత్వం వచ్చాక అలాంటివేమీ లేవన్నారు. రేపో, ఎల్లుండో న్యాయస్థానంలో జగన్‌కేసులపై వాదనలు ప్రారంభమ వుతాయని, ఏ1, ఏ2, ఏ3లంతా ఒకరితర్వాత ఒకరు కోర్టుబోనులో నిల్చోవడం ఖాయమని యనమల తేల్చిచెప్పారు.   ఫెమా, మనీలాండరింగ్‌ మోసాలకు గాను జగన్‌కు శిక్షపడటం ఖాయమని, ప్రజాధ నాన్ని దోచుకొని, 16నెలలు జైల్లో ఉండివచ్చిన వ్యక్తిని ఇన్‌కెమరాద్వారా విచారించడం సరికాదన్నారు. 

 

అత్యాచారకేసుల విచారణలో మాత్రమే ఇన్‌కెమెరా విధానాన్ని అవలం భిస్తారని, జగన్‌ కేసులవిచారణలో బహిరంగవిచారణే జరపాలని, న్యాయస్థానాలు ఈదిశగా పునరాలోచించాలని యనమల విజ్ఞప్తిచేశారు. హిట్లర్‌, ముస్సోలినీల మాదిరి గా తాను అనుకున్నదే జరగాలన్న ఉక్రోషం జగన్‌లో కనిపిస్తోందన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: