తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 22వ తేదిన 120 మున్సి పాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజున  మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయమే ప్రారంభించగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2619 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  ఓట్ల సంఖ్యను బట్టి 5 నుంచి 24 రౌండ్లలో కౌంటింగ్‌ చేపట్టనున్నారు.. ఇక ఈ ఎన్నికల రిజల్ట్ పక్రియ ఇప్పటి వరకు ఉత్కంఠంగా సాగింది. ఇప్పుడిప్పుడె అన్ని చోట్ల నేతల భవిష్యత్తు అర్ధం అయింది.

 

 

ఇక గెలిచిన వారు ఆనందోత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటుండగా, ఓడిన వారు పోయిన డబ్బులు గుర్తుకు వచ్చి, పెగ్గులమీద పెగ్గులు లాగించనికి రెస్టారెంట్ల వైపు పరుగులు పెట్టడానికి సిద్దమవుతున్నారట.. ఇదిలా ఉండగా సిరిసిల్ల మున్సిపాలిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలా ఎందుకంటే ఈ నియోజకవర్గం మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చేటుసుకున్నాయి. ఇలా జరుగుతుందని ముఖ్యంగా అధికార పార్టీ పెద్దలు కూడా ఊహించి ఉండరు. ఇక మొత్తం 39 వార్డులకు ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. అందులో టీఆర్‌ఎస్‌ 24 వార్డుల్లో విజయం సాధించగా.. బీజేపీ 3, కాంగ్రెస్‌ 2, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు. వీరంతా టీఆర్‌ఎస్‌కు చెందిన రెబల్స్‌గా తెలుస్తొంది.

 

 

అయితే రెబెల్స్‌ గెలుపొందినా వారిని తిరిగి టీఆర్‌ఎస్‌లోకి తీసుకునేది లేదని కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఈ అభ్యర్థులను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాము బయటకు వెళ్తామంటూ అభ్యర్థులు పోలీసులతో గొడవ పడి వారిని తొసుకుంటూ బయటకు వెళ్లారు. తర్వాత పోలీసులు ఆ అభ్యర్థులను బలవంతంగా లోపలికి తీసుకెళ్లి తలుపులకు గడియపెట్టినట్లు తెలుస్తుంది.

 

 

ఇక పోతే అధికార పార్టీ కావాల‌నే ఇలా చేయిస్తుందని వారు ఆరోపిస్తున్నారు.. ఓడినోళ్లు బ‌య‌ట‌కు వెళితే గొడ‌వ‌లు జ‌రుగుతాయ‌నే ఇలా చేస్తున్నాం అంటూ పోలీసులు పేర్కొంటున్నారు. కానీ ఏది ఏమైనా కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు మింగుడుపడటం లేదట..

మరింత సమాచారం తెలుసుకోండి: