తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో కారు పార్టీ స్పీడు రేసు కారుని తలదన్నేలా  దూసుకెళ్లడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేసిన మిగతా రాజకీయ పార్టీలన్నీ టిఆర్ఎస్ మున్సిపల్స్ విజయంతో ఒక్కసారిగా కంగుతిన్నాయి 120 మున్సిపాలిటీల్లో 109 మున్సిపాలిటీలను టిఆర్ఎస్ పార్టీ దక్కించుకుని రాజకీయ ప్రత్యర్ధులకు సవాల్ విసిరింది. దీంతో ఒక్కసారిగా లెక్కలన్నీ మారిపోయాయి. తెలంగాణ అంతా టిఆర్ఎస్ హవా నడుస్తుంది అనేది మరోసారి స్పష్టమైంది. టిఆర్ఎస్ పార్టీని బలహీన పడుతుంది భావిస్తూ పార్టీలోకి వెళ్లేందుకు వెనక ముందు ఆడిన మిగతా పార్టీల నాయకులంతా ఇప్పుడు టిఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతో ఆ పార్టీ వైపు చూస్తున్నారు.


ఇప్పుడు పార్టీ మారేందుకు చూస్తున్న వారిలో ముందుగా అశ్వారావు పేట టిడిపి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కనిపిస్తున్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ ప్రత్యర్థులను బలహీనం చేసే క్రమంలో టిడిపి, కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ కు చెందినకొంతమంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు.మొదట్లో టిడిపి ఎమ్మెల్యే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య టిఆర్ఎస్ లోకి వెళ్లేందుకు వెనకడుగు వేశారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన కూడా టిఆర్ఎస్ లోకి వెళ్లారు. ఆయనతో పాటు మరో టిడిపి అశ్వారావు పేట ఎమ్యెల్యే సండ్ర వీరయ్య పార్టీ మారతారని ఊహాగానాలు వినిపించినా ఆయన మాత్రం  తాను పార్టీ మారేది లేదంటూ స్పష్టంగా పేర్కొన్నారు.


 ఓ సందర్భంలో అమరావతికి వెళ్లి మరీ చంద్రబాబును మచ్చా కలిశారు. తాను టిడిపిలోనే ఉంటానని వేరే పార్టీలో కి వెళ్ళేది లేదు అంటూ గట్టిగానే చెప్పారు. కానీ ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. టిడిపికి ఎలాగూ భవిష్యత్తు లేదు కనుక ఇక ఆ పార్టీ ని పట్టుకుని వేలాడితే రాజకీయంగా కనుమరుగైపోతమన్న ఆలోచనకు వచ్చిన ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు సముఖంగా ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: