ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న రాజకీయాలకు 40 ఏళ్ల అనుభవం ఉంది అని అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అంటూ సాక్షాత్తూ ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే గుసగుసలు ఆడుతున్నారు. మూడు రాజధానుల బిల్లు విషయంలో అసెంబ్లీలో ఆమోదం పొందిన గాని శాసనమండలిలో చంద్రబాబు అడ్డుకోవడంతో ఆ బిల్లును నేరుగా ఆమోదం పొందే విధానం ఉన్నాగాని జగన్ కావాలని బిల్లు శాసనమండలిలో పంపించి టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం గ్యారెంటీ అని తెలిసినా గాని పంపించడానికి గల కారణం చూసుకుంటే ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నీ దోషిగా చూపించడమే జగన్ మాస్టర్ స్కెచ్ అని టాక్.

 

దీంతో జగన్ ట్రాప్ లో పడిన చంద్రబాబు...శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుని ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంత ప్రజల ముందు దోషిగా తేలిపోయారు. ఇటువంటి తరుణంలో వైయస్ జగన్ శాసనమండలిని రద్దు చేయడానికి రెడీ కావడంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ పార్టీలోకి రావడానికి రెడీ అవుతున్నట్లు...వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల నిర్ణయానికి జై కొట్టడానికి సిద్ధమైనట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.

 

ముఖ్యంగా శాసన మండలి లో ఉన్న టిడిపి ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీలోకి రావడానికి రెడీ అవుతున్నట్లు ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీ పార్టీ మంత్రులకు టచ్ లో ఉన్నట్లు సోమవారం జరగబోయే అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబుకి మతిపోయే విధంగా జగన్ రాజకీయం చేయబోతున్నట్లు సమాచారం. శాసన మండలి రద్దు అనే నిర్ణయాన్ని తెరపైకి తీసుకు రావడంతో టిడిపిలో ఎప్పటి నుండో ఉన్న సీనియర్ నాయకులు ప్రస్తుతం శాసనమండలిలో ఉండటంతో జగన్ వేసిన మాస్టర్ స్కెచ్ కి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వినబడుతున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: