మార్గదర్శి చిట్ ఫండ్ కుంభకోణంలో రామోజీరావు పై తీవ్రస్థాయిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల సుప్రీంకోర్టు ప్రాంగణంలో చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. రామోజీరావు చాలా తెలివిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపాజిట్లు కలెక్ట్ చేసి ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశారని దేశంలోనే ఇది అతి పెద్ద కుంభకోణం అని అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రామోజీరావు ప్రతివాదిగా కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చారని ఆంధ్ర రాష్ట్రాన్ని మినహాయింపు చేశారని తప్పించుకోవాలని చూశారని అక్రమంగా డబ్బులు సంపాదించి కేసును తప్పుదోవ పట్టించాలని చాలా తెలివిగా వ్యవహరించారని సంచలన కామెంట్లు చేశాడు. ఈ మేరకు కేసులో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని మా విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించడం చాలా హర్షణీయమని నేను ఊహించిన దానికంటే సుప్రీంకోర్టు మంచి ఉత్తర్వులు ఇచ్చింది.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, నాటి విచారణాధికారి కృష్ణంరాజును ఈ పిటిషన్‌లో పార్టీలుగా చేశారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చామన్న క్లైమ్‌లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా లేదా అనే పరిశీలనను కూడా అడ్డుకుంటున్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చినని చెప్పినంత మాత్రాన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవు. ఈ కేసుపై ట్రయల్ కోర్టులో నిబంధనల ప్రకారం విచారణ జరగాలి.

 

విచారణ మొత్తం జరిగి కేసు రుజువైతే మాత్రం గ్యారెంటీగా రామోజీరావు ప్రజల దగ్గర వసూలు చేసిన దానికంటే రెండున్నర రెట్లు అనగా సుమారు 7 వేల కోట్లు జరిమానా పడే అవకాశం తో పాటు రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని ఉండవల్లి తెలిపారు. అయితే ఉన్నట్టుండి ఉండవల్లి ఈ విధంగా రామోజీరావు వ్యవహరించడం వెనకాల మరియు కేసులో ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారని కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: