తెలంగాణలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఉదయం ఎనిమిది గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా ఈరోజు  పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల కౌంటింగ్  జరిగింది. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక అన్ని ఎన్నికల లాగానే టిఆర్ఎస్ పార్టీ... మరోసారి జోరు  చూపించింది . దేశంలోని అన్ని సెంటర్లలో టిఆర్ఎస్ పార్టీ ముందంజలో దూసుకుపోతున్నది . అందరూ అనుకున్నట్టుగానే... కారు స్పీడుకు బ్రేకులు వేయలేకపోయింది  పార్టీ కూడా. 

 

 

 టిఆర్ఎస్ పార్టీ.. చూపించినప్పుడు ఇక మీడియా చానళ్లు అన్ని  టిఆర్ఎస్ గురించి గొప్పగా చెప్పాల్సిందే  కదా. పొద్దున ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి... మెజారిటీ స్థానాలను సొంతం చేసుకుంటూ టిఆర్ఎస్ ఎంత జోరు చూపించిందో ...ఆ  మెజారిటీని తమ తమ ఛానెళ్లలో  చూపించడానికి పలు  న్యూస్ ఛానళ్లు కూడా అంతే దొరుకుతాయి. ఇక కొన్ని ఛానెళ్లలో  అయితే...ఈ  జోరు హోరెత్తిపోయింది. టిఆర్ఎస్ పార్టీ గురించి మహా గొప్పగా చూపించారు. ఇకడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. అక్కడక్కడ   టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ ఇండిపెండెంట్లు  భారీ మెజారిటీ సొంతం చేసుకోవడం లేదా ఇతర పార్టీలు భారీ మెజార్టీ గెలుచుకోవడం లాంటివి జరిగాయి . కానీ వీటి  గురించి వీడియో ఛానల్ లో ఎక్కడ కనిపించలేదు . అధికార పార్టీ గురించి పొగడడం కామన్ ... కానీ మీడియా ఛానల్ లో అన్నప్పుడు మిగతా వారిని కూడా పట్టించుకోవాలి కదా అంటున్నారు పలువురు. 

 

 

 దీనిపై స్పందించిన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీడియో ఛానల్స్  అన్ని ప్రజల తరఫున పోరాడాల్సింది పోయి... దొరవారి ని ఎలా పొగడాలి యువరాజుకు కిరీటం పెట్టి పట్టం ఎప్పుడు  కట్టాలి అని ఆతృతతో నే ఎక్కువగా ఉన్నాయి. ఉదయం నుంచి తెరాస మెజారిటీకి  సంబంధించిన వార్తలు న్యూస్ ఛానల్ బ్రేకింగ్ ఇస్తున్నాయి. కానీ  అసలు సిసలైన బ్రేకింగ్ ఏంటంటే.. కేసిఆర్ సొంత ఇలాక అయిన  గజ్వేల్ నియోజకవర్గంలో 6 ఇండిపెండెంట్లు... కేటీఆర్ ఇలాక అయిన  సిరిసిల్లలో 12మంది ఎ ఇండిపెండెంట్ లు  ఘన విజయం సాధించారు. కానీ ఏ ఒక్క మీడియా సంస్థ దీనిని చూపించడం లేదు... అది కదా అసలు సిసలైన బ్రేకింగ్ అంటే అంటూ రేవంత్ రెడ్డి.. పలు మీడియా ఛానల్ పై తనదైన స్టైల్లో సెటైర్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: