ఈరోజు మున్సిపాల్టీ ఫలితాలు విడుదల అయ్యాయి.. అయితే.. ఈసారి కూడా కేసీఆర్ కూతురు, మాజీ ఎమ్మెల్యే కవితకు ఘోర అవమానం జరిగింది. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా కవిత ఆఖరికి మున్సిపాల్టీ ఎన్నికల్లో కూడా ఘోరంగా ఓడిపోయారు.. దీంతో ఈ రిజల్ట్స్ చుసిన అందరూ అయ్యో.. క‌విత‌కు మ‌ళ్లీ ఘోర అవ‌మాన‌మే... బీజేపీ చేతిలో మ‌ళ్లీ ఓట‌మి అయ్యిందే అని అంటున్నారు. 

                       

ఇప్పటికే 2019 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయినా సీఎం కూతురు కవిత ఇప్పుడు మళ్ళి మున్సిపాల్టీలో ఓడిపోవడం అవమానం అనే చెప్పాలి. అయితే నిజానికి ఇక్కడ ఈసారి ఎం జరిగింది అంటే.. నిజామాబాద్ కార్పొరేషన్ లో ఖచ్చితంగా ఆమె గెలవాలి అని ప్లాన్ వేశారు.. కానీ ఆ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యింది. 

                        

అన్ని మున్సిపాల్టీల కంటే ఎక్కువ దీనిపైనే ఇంట్రస్ట్ పెట్టారు. ఈసారి ఎలా అయినా ఇక్కడ టీఆర్ఎస్ గెలవాలి అని ప్రయత్నాలు చేశారు.. కానీ రాష్ట్రంలో యేవో కొన్ని చోట్లా తప్ప మిగితా అన్ని చోట్లా టిఆర్ఎస్ ఏ గెలిచింది. కానీ ఒక్క నిజామాబాద్ లో మాత్రం టీఆర్ఎస్ కార్పొరేషన్ ను గెలిపియించుకోలేకపోయింది. 

 

అయితే బీజేపీ ఇప్పటికే అక్కడ 50 వార్డుల‌కు 24 వార్డులు ఇప్ప‌టికే గెలిచింది.. దీంతో టిఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. ప్రస్తుతం నిజామాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోవడంతో మరోసారి కవిత పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా టీఆర్ఎస్ అక్కడ ఓడిపోవడం అనేది టిఆర్ఎస్ కి అవమానకరం అనే చెప్పాలి. మరి ఈ ఘోరమైన ఓటమిని కవిత ఎలా తట్టుకుంటుందో ఏమో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: