రాజధాని అమరావతి భూముల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సరికొత్త నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మేటర్ లోకి వెళితే అమరావతిలో రెండు వేల ఐదు వందల ఎకరాల వరకూ పేద ప్రజలకు ఇవ్వటానికి జగన్ రెడీ అయినట్లు భవిష్యత్తులో ప్రభుత్వం మారిన 2500 ఎకరాల భూమిని పేదలకు ఇవ్వాలని ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా సేకరించిన భూమిని ఇల్లు లేని పేదలకు జగన్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వయంగా ప్రకటించారు.

 

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సేకరించిన ఈ భూములను సింగపూర్ స్టార్టప్ కంపెనీ లకు ఇవ్వాలని భావించిన చంద్రబాబు హయాంలో జరిగిన భూ దోపిడీ వల్ల ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలను జగన్ ప్రభుత్వం వచ్చాక ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకోవటంతో తాజాగా ఉగాది పర్వదినాన పేదలకు భూములు ఇచ్చే పనిలో భాగంగా రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా సేకరించిన 2500 ఎకరాల భూమిని పేద ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనలో జగన్ రెడీ అయినట్లు ఈ విషయం గురించి ఇటీవల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం చేసిన సందర్భంలో చర్చించినట్లు డిప్యూటీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

 

దీంతో అమరావతిలో పేద ప్రజల దగ్గర దళితుల దగ్గర అక్రమంగా అన్యాయంగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి తన వర్గ ప్రజల కోసం చంద్రబాబు కట్టబెట్టిన భూములను ముఖ్యమంత్రి జగన్ పేద ప్రజలకు ఖచ్చితంగా ఇస్తే మాత్రం రాబోయే ఎన్నికల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 175 స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ జెండా గెలవటం ఎగరటం గ్యారెంటీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోపక్క చంద్రబాబు హయాంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించి అన్ని ఆధారాలను బయట పెడుతూ ఆ సమయంలో ఎవరెవరు ఎక్కడ ఎంత ఎన్ని ఎకరాలు భూములు కొన్నారో వంటి విషయాలపై విచారణ చేయించడానికి జగన్ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: