తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు  సంబంధించిన కౌంటింగ్ ఈరోజు జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య  ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా... పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో... అన్ని ఎన్నికల లాగానే కారు పార్టీ జోరు చూపించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కారు పార్టీ 100 స్పీడ్ తో దూసుకుపోయింది. దీంతో టిఆర్ఎస్ శ్రేణులందరు  సంబరాల్లో మునిగిపోయారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ జోరు  చూపినప్పటికీ అదే జోరును... సీఎం సొంత జిల్లాలో మాత్రం కొనసాగించ లేక పోయింది కారు పార్టీ.

 

 

 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో టిఆర్ఎస్ జోరు చూపిస్తూ ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేస్తూ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గులాబీ అధినేత కెసిఆర్ సొంత జిల్లా అయిన మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది . నారాయణఖేడ్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ను చిత్తు చేసి  కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకుంది . 15 స్థానాలున్న నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 8 వార్డులు గెలిచుకోగా ,  టిఆర్ఎస్ పార్టీ 7 వార్డులు  మాత్రమే గెలుచుకున్నది. దీంతో సీఎం సొంత జిల్లాలోనే కారు పార్టీ కి భారీ షాక్ తగిలింది. ఇక అటు నారాయణఖేడ్ ఫలితాలతో టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళనలో పడ్డారు.

 

 

 ఇకపోతే గతంలో  మున్సిపల్ ఎన్నికల్లో ... ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా ఓడిపోయే ప్రసక్తి లేదని... ఏ ఒక్క మున్సిపాలిటీ ఓడిపోయిన... మంత్రులపై కఠినంగా చర్యలు ఉంటాయి అంటూ గులాబీ అధినేత కేసీఆర్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించి టిఆర్ఎస్ ని వెనక్కి నెట్టడం తో.... బాధ్యులపై కెసిఆర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అందరి చూపు మాత్రం సీఎం సొంత జిల్లా పైన ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే సీఎం సొంత జిల్లాలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే ఘన విజయాన్ని సాధిస్తుంది అనుకున్న టీఆర్ఎస్ పార్టీకి నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ భారీ షాక్ ఇచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: