తెలంగాణ రాష్ట్రంలో రెండో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఎంపీ స్థానాలు రాకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీలు కాంగ్రెస్ - బిజెపి పార్టీలో తీవ్ర స్థాయిలో కేసీఆర్ నాయకత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టాయి.

 

ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలను మరియు అదే విధంగా కార్పొరేషన్ స్థానాలను కైవసం చేసుకోవడంతో తెలంగాణ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎన్నికలు కేటీఆర్ సారధ్యంలో గెలవడంతో భవిష్యత్తు ముఖ్య మంత్రి కేటీఆర్ అంటూ ఇప్పటికే అనేక వార్తలు వస్తున్న తరుణంలో త్వరలో అనగా ఫిబ్రవరి ఒకటవతారీకు కేటీఆర్ కి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం అయ్యే ఛాన్స్ ఉందని తాజాగా ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ గా వచ్చిన సందర్భంలో కొంత మంది టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కెసిఆర్ కు సన్నిహితంగా ఉండే నాయకులు కామెంటు చేస్తున్నట్లు పార్టీలో వినికిడి.

 

గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా కేటీఆర్ తనదైన శైలిలో పార్టీని ముందుకు నడిపించి అత్యధిక స్థానాలు హైదరాబాద్ నగరంలో టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం వెనుక చాలా వైవిద్యంగా కృషి చేశారని ఇప్పుడు ఇదే స్థాయిలో అనగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టారు అని కేటీఆర్ నాయకత్వంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.

 

ముఖ్యంగా జరిగిన ఎన్నికలలో కొన్ని జాతీయ పార్టీలకు కంచుకోటగా ఉన్న ప్రాంతాలలో కూడా టిఆర్ఎస్ గెలవడంతో రెండు జాతీయ పార్టీల నేతల ప్రస్తుతం ఏం మాట్లాడలేని స్థితిలో కి వెళ్లిపోయినట్లు తెలంగాణ రాజకీయాల వార్తలు వినపడుతున్నాయి. బ్యాలెట్ పద్ధతి రూపంలో జరిగిన ఎన్నికల్లో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు అని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: