రాష్ట్రంలో ఎంత ఉన్నా కూడా 50 సీట్లు కూడా రాలేదని అంటున్నారు ఎంపీ రేవంత్.. కారు గుర్తుకు తెలంగాణ సమాజం బ్రహ్మరథం పట్టిందని వార్తా ఛానెళ్లు ఎలా ప్రసారం చేస్తాయని ఆయన మండిపడ్డారు ‘సరిలేరు నీకెవ్వరూ’ అంటూ సీఎం కేసీఆర్‌కు భజన చేయడానికి కొన్ని న్యూస్ ఛానెళ్లు అమితాసక్తి కనబరుస్తున్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ.. ప్రభుత్వ పథకాలనో, కార్యకర్తలనో నమ్ముకొని విజయం సాధించలేదని.. డబ్బులు, మద్యం, పోలీసులు, అధికారుల మీద ఆధారపడి నెగ్గారని ఆయన ఆరోపించారు.

 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...కేసీఆర్, కేటీఆర్ సమర్థత మీద ఆధారపడి ఈ ఎన్నికలు జరగలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రకటన నుంచి రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలు, ఫలితాలు అన్నింట్లో అడ్డగోలుగా నియమ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. కాంగ్రెస్‌‌కు నష్టం చేకూర్చేవిధంగా ప్రవర్తించారని మండిపడ్డారు. టీఆర్ ప్రచారం చేసిన సిరిసిల్లలో ఆయనకు, టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా 10 మంది స్వతంత్రులు గెలిచారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనూ టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా 6 మంది స్వతంత్రులు గెలిచారని తెలిపిన రేవంత్ రెడ్డి.. బ్రేకింగ్ న్యూస్ ఇదని చెప్పారు.

 

ఎన్నికల ప్రచార సమయంలో ఎక్కడా తిరగనని కేటీఆర్ అన్నారని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఈ క్రమమాలిలో ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నయానై రేవంత్ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌కు వాళ్ల సొంత నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదురైతే.. మీ న్యూస్ ఛానెళ్లలో కనీసం ఒక్క లైన్ స్క్రోలింగ్ అయినా పెట్టారా?’ అని రేవంత్ ప్రశ్నించారు.


పెళ్లిళ్ల‌లో సంగీత్ల‌కు రిహార్స‌ల్‌కు ముందే చేసిన‌ట్టు ఉన్నారు.బోడుప్ప‌ల్లో బోడిగుండుకు దిక్కులేదు.. అక్క‌డ బ్యాలెట్లు ఓపెన్ చేయ‌కుండానే బోడుప్ప‌ల్ టీఆర్ఎస్ గెలిచింద‌ని బ్రేకింగులు వేస్తూ వ‌చ్చారు.ఒకాయ‌న స‌రిలేరు నీకెవ్వ‌రు అని నిలువెత్తు క‌టౌట్ పెట్టి న‌డిపించార‌ని చెప్పారు. అది టీవీ 9 చేసింది.. మ‌రో టీవీ స‌రిలేరు కారుకెవ్వ‌రు అని న‌డిపిస్తుండ్రు అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: