తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఎన్నికల్లో సత్తా చాటారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కొందరు అమరావతి విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో మూడు రాజధానులు అంటున్నారు. దీనిపై మీరేం చెబుతారని అడిగారు. ఈ ప్రశ్నకు కేసీఆర్ చాలా చాకచక్యంగా సమాధానం చెప్పారు.

 

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారంపై మీరేమంటారు అని అడిగితే.. అది ఆ రాష్ట్రం అంతర్గత సమస్య.. అంటూ బదులిచ్చారు. అంతే కాదు.. అది వాళ్లు వాళ్లూ తేల్చుకుంటారు.. వాళ్ల తిప్పలు వాళ్లు పడతరు.. మనకెందుకు బ్రదర్.. అంటూ నవ్వుతూ సమాధానం దాట వేశారు. ఆ తర్వాత విలేఖరులు ఏదో ప్రశ్న వేయగా.. అది సీక్రెట్ బ్రదర్.. నీకు ఎలా చెబుతాం అంటూ కామెంట్ చేశారు.

 

అవును.. నీకు చెబితే అందులో సీక్రెట్ ఏముందంటూ నవ్వారు కేసీఆర్.. నేను నీకు చెబితే.. నువ్వు నీ దోస్తుకు చెబుతవ్.. ఇంక అందులో సీక్రట్ ఏముంది చెప్పు.. ‌అంటూ సెటైర్లు వేశారు. ప్రెస్ మీట్ ఆద్యంతం కేసీఆర్ హుషారుగా కనిపించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి గులాబీ పార్టీ సత్తా చాటింది. తెలంగాణలో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించింది. 120కి మున్సిపాలిటీల్లో 108 వరకూ గెలచుకుని తనకు సాటి లేరని తేల్చి చెప్పింది.

 

ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ సింగిల్ డిజిట్ కు పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈ విజయం పై ఆనందం వ్యక్తం చేసిన కేసీఆర్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఘనవిజయం ఏ పార్టీకి దొరకదని, ఇది మామూలు విషయం కాదని అన్నారు. డిసెంబరులో తాను అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళుతుంటే అనేక వ్యాఖ్యలు చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కానీ 88 సీట్లు గెలిచామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తమను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు విశ్వప్రయత్నాలు చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: