సంక్షేమ పథకాలు అంటే మొదట గుర్తొచ్చేది దివంగత వైఎస్సార్‌నే. ఆయన పాలన కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ఎంతమంది ప్రజల మదిలో దేవుడయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆయన వారసుడుగా తొలిసారి అధికార పీఠం ఎక్కిన సీఎం జగన్ మోహన్ రెడ్డి...తన 8 నెలల పాలనకాలంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేశారో అందరికీ తెలుసు. ముఖ్యంగా అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచి, వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులకు అండగా నిలిచారు. అయితే పెన్షన్ అనేది దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అమలు అవుతుంది. కాబట్టి ఈ పథకం అనేది సాధారణమే.

 

అలాగే రైతు భరోసా పేరిట...ఏటా రైతులకు రూ. 13,500 ఇస్తున్నారు. రైతు భరోసా కూడా చాలాచోట్ల అమలవుతుంది. కేంద్రం కూడా ఇస్తుంది. ఇక ఆటో డ్రైవర్లకు రూ. 10 వేలు, మత్స్యకారులకు రూ.10 వేలు, చేనేత కార్మికులకు రూ. 24 వేలు ఇవ్వడం వల్ల జగన్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లారు. అయితే ఈ పథకాల వల్ల ప్రజలకు బాగానే మేలు జరిగింది. అటు జగన్‌కు కూడా మంచి పేరు వచ్చింది. పైగా ఈ పథకాలకు మంచి ప్రచారం జరిగింది. ప్రజలకు బాగా చేరువయ్యాయి.

 

అయితే మూడు రాజధానులపైన ప్రతిపక్షాల రాజకీయం చేసే సమయం, రాష్ట్రమంతా కూడా మూడు రాజధానులపై ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తరుణంలో జగన్ దేశంలోని ఎక్కడ లేని విధంగా అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు. ప్రతి పేద తల్లి పిల్లలు చదువుకోవాలనే లక్ష్యంతో అమ్మఒడి పేరిట రూ 15,000 సాయం చేయడానికి సిద్ధమయ్యారు. అమ్మఒడిలో భాగంగా ఈ ఏడాది 40 లక్షలకు పైనే తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 15 వేలు డిపాజిట్ చేయడంతో ప్రతి పేద తల్లి సంబరపడిపోయింది.

 

కానీ ఓ వైపు మూడు రాజధానులపై రాజకీయం కొనసాగుతుండగానే, ఈ అమ్మఒడి పథకం సైలెంట్‌గా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల చేస్తున్న కుట్రలని తిప్పికొట్టడంలో బిజీగా ఉండటం వల్ల అమ్మఒడికి అనుకున్నంత ప్రచారం చేయకపోయిన  అమ్మఒడి మాత్రం ప్ర్రజల్లోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు వచ్చిన అన్ని పథకాలని డామినేట్ చేస్తూ, జగన్‌ని మరోస్థాయికి తీసుకెళ్లింది. ఇక ఈ అమ్మఒడి ఫలితం ఎలా ఉంటుందో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోతుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: