కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది. ఆయన కాస్త మెత్త బడ్డారా.. త్వరలోనే ఆయన కేటీఆర్ ను సీఎం చేసేస్తారా.. ఇప్పుడు తెలంగాణలో ఈ అంశంపై చర్చ సాగుతోంది. ఇప్పటికే పార్టీ పగ్గాలు తనయుడికి అప్పగించిన కేసీఆర్ .. సీఎం కుర్చీని కూడా కేటీఆర్ కు అప్పగించేస్తాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నలకు కేసీఆర్ తమాషాగా సమాధానం చెప్పారు.

 

 

తాను ఇటీవల కాస్త ఒంట్లో నలతగా ఉంటే ఆసుపత్రికి వెళ్లానని.. అక్కడ వైద్యులు ఏకంగా 20, 30 సీసాల బ్లడ్ తీశారని సీఎం కేసీఆర్ చెప్పారు. అసలే బక్కోణ్ణి.. నా కాడ కూడా ఫుల్లు బ్లడ్ తీసిండ్రు.. ఆ బ్లడ్ శాంపిల్స్ తో అన్ని టెస్టులు చేసిండ్రు.. చేసిన తర్వాత ఒక్కటే చెప్పిండ్రు.. నువ్వు దుక్కలా గున్నవ్ రా భయ్.. అన్నరు.. ఏం కాలే.. జర కోల్డ్ ఎక్కువైంది.. ఈ గోలీలేసుకో.. తగ్గిపోతది.. అంతే.. నీకేం సూపర్ ఉన్నవు అన్నరు..అంటూ నవ్వుతూ చెప్పారు కేసీఆర్.

 

 

ఏం నేనేం బాగాలేనా.. బాగా లేకుండా ఉండేందుకు నేనేం తప్పులు చేసిన అంటూ విలేఖర్లనే ప్రశ్నించారు కేసీఆర్.. మొత్తం మీద కేసీరఆర్ తన ఆరోగ్యంపై మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇప్పటి వరకూ కేసీఆర్ త్వరలోనే కేటీఆర్ ను సీఎం చేసేస్తారంటూ జరిగిన ప్రచారానికి అడ్డుకట్ట పడుతుందా.. ఆ విషయంలో ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకే కేసీఆర్ తన ఆరోగ్యం బేషుగ్గా ఉందని చెప్పారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

 

 

అయితే కేసీఆర్ ఆరోగ్యం బాగా ఉన్నంత మాత్రాన కొడుకుకు సీఎం సీటు అప్పగించకూడదని కూడా ఎక్కడా లేదు కదా.. తాను అన్నీ బావున్న సమయంలోనే కొడుకుకు సీఎం పీఠం అప్పగించేస్తే.. ఆపై తాను సూపర్ సీఎంగా పై నుంచి పర్యవేక్షణ చేయొచ్చు అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ కేసీఆర్ మనసులో ఏముందో.. ఏ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: