ప్రతి మతానికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఆయా సంప్రదాయాలను మతం వారు ఎంతో నిష్టతో పాటిస్తూ ఉంటారు. కొన్ని మతాలవారు సంప్రదాయాన్ని పాటించకపోవడం నేరంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ క్రమంలో హిందువులకి ఎన్నో సంప్రదాయాలు ఉన్నట్లే ముస్లింలకు కూడా ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. ముస్లిం మహిళలందరూ బుర్కా వేసుకుని ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. బుర్కా  వేసుకోవడం తమ సాంప్రదాయంలో ఒక భాగం. ముస్లిం మతం లోని ప్రతి ఒక్క మహిళ బుర్కా ధరిస్తుంటారు. ఈ బురఖా ధరించడం వెనుక ఎంతో చారిత్రాత్మక కథ కూడా ఉంది. 

 

 

 అయితే ఈ బుర్ఖా ధరించడం కళాశాలలో కానీ ఇంకెక్కడైనా అడ్డు చెప్పరు. ఎందుకంటే అలా అడ్డు  చెప్తే సంప్రదాయాన్ని కించపరిచినట్లు గా ఉంటుంది. ముస్లిం మహిళలు బుర్ఖా ధరించ లేదు అంటే అది నేరంగా పరిగణిస్తూ ఉంటారు. ముస్లిం మహిళలు ఎవరిని చూసినా... బుర్కా తోనే కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ముస్లిం మహిళలు ధరించే బుర్కా  పై ఒక కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బురఖా ధరించి కళాశాలకు వచ్చిన మహిళకు ఫైన్ విధించింది కళాశాల యాజమాన్యం. 

 

 

 ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. విద్యార్థులు నిరసన తెలపడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే...పాట్నాలో  ఓ మహిళా కళాశాల యాజమాన్యం తీసుకొన్న  ప్రస్తుతం సంచలనంగా  మారింది. ముస్లిం విద్యార్థినిలు ఎవరు బుర్ఖా ధరించి కళాశాలకు రాకూడదు అంటూ జేడీ మహిళా కళాశాల యాజమాన్యం షరతులు విధించింది. ఒకవేళ కళాశాల యాజమాన్యం పెట్టిన నిబంధనలను అతిక్రమించి బుర్ఖా ధరించి ముస్లిం విద్యార్థునిలు  కళాశాల కు వస్తే 250 రూపాయల పైన్ విధిస్తామంటూ హెచ్చరించింది.. కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థులు ఈ రోజు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని  వెనక్కి తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: