తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ అంటేనే విలేఖరులకు చాలా ఇంట్రస్టు ఉంటుంది. ఎందుకంటే.. మాంచి మాంచి మాసాలా డైలాగులు పేలతాయి. అక్కడక్కడా కామెడీ పండుతుంది. సెటైర్ల మీద సెటైర్లు వేస్తారు. విలేఖరులకు చేతి నిండా పని ఉంటుంది. అందుకే కేసీఆర్ ప్రెస్ మీట్ ను తప్పకుండా ఆసక్తిగా వింటారు. ఇక జనం సంగతి సరే.. సరే.. తనకు బాగా పట్టు‌న్న భాషాపటిమతో ఆయన చెప్పే మాటలు పొరుగు రాష్ట్రం వారు కూడా ఇంట్రస్టు చూపిస్తారు.

 

అలాంటిది.. తాజాగా ప్రెస్ మీట్లో ఓ తమాషా జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో బయటి నుంచి రెండుసార్లు డిస్టర్బెన్స్ జరిగింది. ఎన్నికల్లో గెలిచిన సంబరంలో కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్ద పటాసులు భారీగా కాలుస్తున్నారు. ఢామ్ ఢామ్ అని పేలుళ్ల శబ్దం ప్రెస్ మీట్ కు అడ్డంకిగా మారింది.

 

మొదటిసారి కేసీఆర్ పెద్దగా డిస్టర్బ్ కాలేదు. కానీ.. రెండోసారి మాత్రం తన స్పీచ్ ఆపేశారు. తన సెక్యూరిటీ, ఇతర సిబ్బందికి క్లాస్ పీకారు కేసీఆర్. ఏందయ్యా.. ఏందిది.. బయట ఏం జరుగుతంది.. పటాకులు కాలుస్తున్నరా.. లేకపోతే..ఈడ కూడ ఎవడైనా మోపైండా.. తాపతాపకు ఏందిది … అంటూ కోపగించుకున్నారు కేసీఆర్. .. కేసీఆర్ అలా నవ్వుతూ అనడంతో.. ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్ నవ్వులతో నిండిపోయింది. తర్వాత కేసీఆర్ తన స్పీచ్ కంటిన్యూ చేశారు.

 

కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే ఇలాంటి చెణుకులు చాలా ఉంటాయి. ప్రత్యర్థులపై ఎలా వాగ్బాణాలతో విరుచుకుపడతారో.. అదే ప్రెస్ మీట్లో మళ్లీ విలేఖరులపై సెటైర్లు, జోకులు వేస్తారు. ఒక్కోసారి విలేఖరులపైనా కోపం ప్రదర్శిస్తారు.. ఆయన ఏం చేసినా స్పాంటేనియస్ గా ఉంటుంది. ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు ఉంటుంది. అయితే ఎన్ని సెటైర్లు వేసినా.. ఎన్ని జోకులు పేల్చినా.. తాను చెప్పదలచుకున్న విషయం జనంలోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటారు కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: