తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల అయ్యాయి.. రాష్ట్రవ్యాప్తంగా ఈ మున్సిపాల్టి ఫలితాల్లో కారు జోరుని ఆపలేకపోయారు. జాతీయ పార్టీలు సైతం సీఎం కేసీఆర్ ఫలితాలను ఆపలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మీడియా ముందు అద్భుతంగా మాట్లాడారు. 

 

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒకే రకమైన ఫలితాన్ని ఇచ్చారు.. ఒక పార్టీ నాయకత్వం పట్ల ఇంత ప్రేమ, ఆదరణ ఎక్కడ చూడలేదు.. ఎప్పుడు ఏ నాయకుడు వద్ద చూడలేదు.. ఎంతో నమ్మకం ఉంటె తప్ప మాకు ఈ విజయం రాదు.. ఈ విజయాన్ని గుండెల్లో దాచి పెట్టుకుంటాం అని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. 

 

అంతేకాదు.. ఇంకా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ గెలుపు మాకు మరింత బాధ్యతను పెంచింది. గెలుపుతో పార్టీ కార్యకర్తలు గర్వం తెచ్చుకోకూడదు అని కార్యకర్తలకు సీఎం కేసీఆర్ సూచించారు. అంతేకాదు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ఈ విజయం మాకు సాధ్యమైంది. అందరిని కలుపుకుపోతున్నాం. 

 

ఇది ప్రజలకు ఎంతో నచ్చింది. వెన్నుతట్టి తమను ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు. విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు అని కేసీఆర్ చెప్పారు. కేటీఆర్ కు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి చక్కటి ఫలితాలు సాధించారు. ఇటువంటి ఘన విజయం సాధించడం మమూలు విషయం కాదు అని అన్నారు సీఎం కేసీఆర్‌. 

 

కాగా సీఎం కేసీఆర్.. కేటీఆర్ కు నా ఆశీస్సులు అని చెప్పడం కొంచం వైరల్ ఏ అయ్యింది. ఎందుకంటే.. గత కొద్దీ రోజులుగా సీఎం కేసీఆర్ కేటీఆర్ ని తన వారసుడిగా ప్రకటించి సీఎంని చేస్తారు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కేటీఆర్ సీఎం అని త్వరలోనే అవ్వనున్నారు అనేది చెప్పకనే చెప్పారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి కేటీఆర్ ఎప్పుడు సీఎం అవుతారు అనేది చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: