మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వేళ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి గెలుపుల వేళ పాలకులు వరాల జల్లు కురిపిస్తుంటారు. కేసీఆర్ కూడా అలాంటి వరాలు ఒకటి రెండు ప్రకటించినా అదే సమయంలో బిగ్ షాక్ ఇచ్చారు. త్వరలోనే మన్సిపల్, పంచాయతీ పన్నులు పెంచుతామని కుండ బద్దలు కొట్టేశారు.

 

అవును..మరి ఏదైనా అభివృద్ధి చేయాలంటే డబ్బులు ఎక్కడ నుంచి తెస్తాం చెప్పండి.. జనం నుంచే కదా.. అంతే కాకుండా ఈ పన్నులు చాలా కాలంగా పెంచలేదు. అందుకే కాస్త పెంచబోతున్నాం.. జనం సహకరించాలి. అయితే ఈ పెంపు భారంగా ఉండదు లెండి. దీనిపై అప్పుడే నిర్ణయం తీసుకోబోం. దీనిపై ప్రజల్లో డిబేట్ కు పెడతాం.. ఆ తర్వాతే పెంచుతాం.. అయితే ఈ పెంపు నుంచి బడుగు, బలహీన వర్గాలకు ఉపశమనం కల్పిస్తాం..

 

దళితులు, గిరిజనులకు ఈ పన్నుల పెంపు ఉండదు.. ఆదాయం ఉన్నవారికి , ఆదాయం సంపాదించేవారికి.. పన్నులు కట్టగలిగే వారే టాక్స్ పెంచుతాం..మరి ప్రభుత్వాలు సౌకర్యాలు అందించాలంటే డబ్బులు కావాలి కదా అని తేల్చి చెప్పేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఎన్నికల్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే.

 

మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి గులాబీ పార్టీ సత్తా చాటింది. తెలంగాణలో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించింది. 120కి మున్సిపాలిటీల్లో 108 వరకూ గెలచుకుని తనకు సాటి లేరని తేల్చి చెప్పింది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ సింగిల్ డిజిట్ కు పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈ విజయం పై ఆనందం వ్యక్తం చేసిన కేసీఆర్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఘన విజయం ఏ పార్టీకి దొరకదని, ఇది మామూలు విషయం కాదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: