నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ హవా చూపించండి.. అక్కడక్కడ   కాంగ్రెస్ పార్టీ కూడా సత్తా చాటింది. మొత్తంగా అయితే కాంగ్రెస్ కంచుకోట లాంటి స్థానాల్లో  కూడా టిఆర్ఎస్ ముందంజలో దూసుకుపోయి  విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో ఓడిపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇక మున్సిపల్  ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో  సైనికుల్లా పోరాడి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు సలాం చేస్తున్నాను  అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. 

 

 

 ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులందరూ వోటర్లను ప్రలోభాలకు గురి చేసే విజయం సాధించారు అంటూ ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేకత తోనే ఇండిపెండెంట్ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో అధిక సంఖ్యలో గెలిచారు అంటూ వ్యాఖ్యానించారు పొన్నం ప్రభాకర్. ఇండిపెండెంట్ గా  విజయం సాధించిన టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థులను తిరిగి పార్టీలోకి తీసుకొము అంటూ తేల్చి చెప్పిన కేటీఆర్ మాటపై  నిలబడతారా అంటూ  పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమి  పై తమకు అనుమానంగా ఉందని... ముఖ్యంగా వేములవాడ 17 వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఒక్క ఓటు కూడా రాకపోవడం తమలో  అనుమానాలు రేకెత్తిస్తుంది అంటూ పేర్కొన్నారు. దీనిపై విచారణ నిర్వహించాలంటూ ఈసీకి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్  సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ తెలిపారు. 

 

 

 ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల సంఘం పై కూడా విమర్శలు గుప్పించారు పొన్నం ప్రభాకర్. చట్టవిరుద్ధంగా టిఆర్ఎస్ పార్టీ క్యాంపు నిర్వహిస్తే... ఎన్నికల సంఘం మాత్రం చూస్తూ మౌనంగానే ఉండిపోయింది అంటూ విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది అని వ్యాఖ్యానించిన పొన్నం ప్రభాకర్... మున్సిపాలిటీలో అన్ని పనులు పెంచబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: