జ‌న‌వ‌రి 26న గ‌ణ‌తంత్ర దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ అవార్డుల విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. ఈ అవార్డుల కొర‌కు 21 మంది జాబితాను తీసుకుంది. వారిలో వివిధ రంగాల్లో ప‌నిచేసిన వారు ఉన్నారు. ఈ అవార్డుల‌ను రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందిస్తారు. 

 

అవార్డు గ్రహీత‌లు వీరే...

 జగదీశ్‌ లాల్‌ అహుజా, జావేద్‌ అహ్మద్‌ తక్- సామాజిక సేవ
మహ్మద్‌ షరీఫ్‌, తులసి గౌడ - సామాజికసేవ, పర్యావరణం
సత్యనారాయణ్‌- సామాజిక సేవ, విద్యా విజ్ఞనం
అబ్దుల్‌ జబ్బార్‌ - సామాజిక సేవ, ఉషా చౌమార్‌ - పారిశుద్ధ్యం
పోపట్‌రావ్‌ పవార్‌ - సామాజిక సేవ, నీటి విభాగం
హరికలా హజబ్బా- సామాజిక సేవ, విద్యా విభాగం
అరుణోదయ్‌ మండల్‌ - వైద్య, ఆరోగ్యం
రాధామోహన్‌, సంభవ్‌ సే సంచయ్‌ - సేంద్రియ వ్యవసాయం
కుశాల్‌ కన్వర్‌ (అసోం) - పశువైద్యం
ఎస్‌. రామకృష్ణన్‌ (తమిళనాడు)- సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం
సుందరవర్మ (రాజస్థాన్‌) - పర్యావరణం, అడవుల పెంపకం
ట్రినిటీ సయూ (మేఘాలయ) - సేంద్రియ వ్యవసాయం
రవి కన్నన్‌ (అసోం)- వైద్యం, అంకాలజీ విభాగం

 

 ప్రతి ఏటా ఈ అత్యున్నత పురస్కారాలను కేంద్రం ప్రకటిస్తూ వ‌స్తోంది. ఈ ఏడాదికి గాను మొత్తం 141 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేశారు. అందులో ఏడుగురిని పద్మ విభూషణ్ కి సెలెక్ట్ చేయ‌గా... 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మ శ్రీ అవార్డు వరించాయి. మ‌రి ఎప్పుడూ గ‌ర్న‌మెంట్ ఇంత మంచి ప‌నుల‌ను ముందుకు తీసుకువెళ్ళే విధంగా పెట్టిన ఈ అవార్డుల‌ను ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఈ సారి జాబితాలో చాలా మంది ప్ర‌ముఖులు చోటు చేసుకున్నారు. వీరిలో అతి ముఖ్య‌మైన వారు ముగ్గురు ఉన్నారు. జగదీశ్ లాల్ అహూజా(లంగర్ బాబా), జావేద్ అహ్మద్ తక్, మ‌హ్మ‌ద్ హ‌రీష్‌. ఇక ఇదిలా ఉంటే... ఈ సారి  ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డుల జాబితాలో తెలుగువారికి పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: