ఒకప్పుడు బ్యాంకుకు వెళితే కానీ ఎలాంటి లావాదేవీలు జరిగేవి  కాదు... కానీ ఇప్పుడు మాత్రం అరచేతి నుంచి అన్ని లావాదేవీలు జరుపుకుంటున్నారు జనాలు . ముఖ్యంగా ఆన్లైన్ పేమెంట్ యాప్స్  వచ్చిన తర్వాత ఈ లావాదేవీలు జరపడం మరింత సులభంగా మారిపోయింది. ఒక్క క్లిక్ చేస్తే చాలు ఎలాంటి ట్రాన్సాక్షన్ అయినా చేయడానికి వీలు ఉంటుంది ఈ రోజుల్లో. స్మార్ట్ఫోన్లు  ఉన్న వినియోగదారులు అందరూ ఎక్కువగా ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏ వస్తువు కావాలని ఆన్లైన్లోనే దొరుకుతుండటంతో ఆన్లైన్లో నుండే  పేమెంట్ చేసి ఆన్లైన్లోనే వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. రోజు వండుకునే కూరగాయల దగ్గర నుంచి ప్రతి వస్తువు ఆన్లైన్ లో దొరుకుతుంది. దీంతో ఆన్లైన్ పేమెంట్ యాప్స్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. 

 

 

 అయితే నెటిజన్లను ఆకర్షించేందుకు రోజురోజుకు సరికొత్త ఆన్లైన్ పేమెంట్ యాప్  లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే సరికొత్తగా ఎన్ని ఆన్లైన్ పేమెంట్ యాప్స్  వచ్చినప్పటికీ.. నెటిజన్లు  మాత్రం కొన్నింటికే  ఆకర్షితులవుతున్నారు.కొని  ఆన్లైన్ పేమెంట్ యాప్ లనే  ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు ఎక్కువగా ఉపయోగిస్తున్న ఆన్లైన్ పేమెంట్ యాప్ లలో  మొదటి వరుసలో ఉండేది పేటీఎం. ఎక్కువగా పేటియం వాడితూ  పేటియం ద్వారా అన్ని లావాదేవీలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు జనాలు. ఇక అటు పేటీఎం కూడా ఎన్నో ఆసక్తికర ఆఫర్లు  ప్రకటిస్తూ ఉండటంతో.. రోజురోజుకు పేటీఎం వినియోగదారుల సంఖ్య ఎక్కువ అయిపోతుంది. 

 

 

 రోజురోజుకు ఆన్లైన్ పేమెంట్ యాప్స్ పెరుగుతున్నట్లే..  సైబర్ నేరగాళ్ల బెడద కూడా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 3500 నెంబర్ల  పై పేటీఎం కేసులు నమోదు చేసింది . మీ ఓటీపీ చెప్పండి లేదంటే మీ పేటీఎం ఖాతా  బ్లాక్ అయిపోతుంది అంటూ మెసేజ్లు పంపి.... పేటీఎం కస్టమర్ డబ్బులు కొట్టేసిన వారిపై పే టీఎం యాజమాన్యం కేసులు పెట్టింది. కస్టమర్లకు ఓటీపీ తెలపాలి అంటూ మెసేజ్లు వెళ్లిన నెంబర్లను నోయిడా పోలీసులకు అందించి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించింది  పేటీఎం. అంతేకాకుండా 3500 నెంబర్లను ట్రాయ్ కి  అప్పగించి... పేటీఎం యూజర్లకు కలుగుతున్న నష్టాన్ని వివరించి బిజినెస్ దెబ్బతినకుండా చూడాలి అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: