మూడు రాజధాని అంశం ప్రస్తుతానికి పెండింగ్ లో పడినప్పటికీ వైసీపీ ప్రభుత్వం వన్ ఆ విషయంలో ఎక్కడా వెనుకడుగు వేసేందుకు ఇష్టపడడం లేదు. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు తిరస్కరణకు గురైన, కాస్త ఆలస్యమైనా ఆ బిల్లు ఆమోదం పొందుతుంది అనే భావంలో ప్రభుత్వం ఉంది. ఎప్పటికైనా విశాఖను పరిపాలన రాజధానిగా చేసి తీరుతారనే ఆలోచనతో ముందస్తుగా విశాఖలో పలు అభివృద్ధి పనులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉగాదిలోగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి విశాఖ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూమిని సేకరించాలని జగన్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. 


విశాఖ జిల్లాలోని మొత్తం పది మండలాల్లో భూ సేకరణ ద్వారా 6116.50 ఎకరాలను తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీమునిపట్నం, ఆనందపురం, పెదగంట్యాడ, విశాఖ గ్రామీణ, అనకాపల్లి మండలాల్లో ల్యాండ్ పూలింగ్ చేసి అభివృద్ధి చేసిన భూమిని తిరిగి ప్యాకేజీగా  ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను కూడా సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసైన్డ్ భూములు ఉన్న వారికి తగిన పరిహారం చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి బదులుగా 900 గజాలు అభివృద్ధి చేసిన భూమిని వారికి తిరిగి ఇస్తారు. 


అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమించి పదేళ్లకు పైగా అక్కడ నివాసం ఉండే వారికి ఎకరానికి 450 గజాలు అభివృద్ధి చేసిన భూమిని అందించేలా ప్యాకేజీని రూపొందించారు. అయితే ఎకరానికి 250 గజాల డెవలప్ చేసిన భూమిని తిరిగి ఇస్తారు. ఇక 5 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారికి ఎటువంటి పరిహారం అందదు. భూ సేకరణలో భాగంగా అభివృద్ధి చేసిన భూమిలో 15 శాతం విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉగాది నాటికి సుమారు 25 లక్షల మంది పేదల ఇళ్ల పట్టాల కోసం భూమిని సేకరించే పనిలో భాగంగా ఈ విధంగా జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: