ఏపీలో బీజేపీ కి ఏ స్థాయిలో ఆదరణ ఉందో అదే స్థాయిలో జనసేన పార్టీకి ఆదరణ ఉంది అన్న సంగతి అందరికి తెలిసిందే. దీంతో ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు నడిచేందుకు ఇటీవలే ఒప్పందం చేసుకున్నాయి జనసేన బిజెపి పార్టీలు. ఇకపై అన్ని కార్యక్రమాలను ఇరు పార్టీలు కలిసి చేయడమే కాకుండా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, నిత్యం ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలని నిశ్చయించుకున్నారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా బలపడడమే కాకుండా , అధికారం చేజిక్కించుకోవాలని ఈ రెండు పార్టీలు ప్లాన్ వేస్తున్నాయి. ఈ మేరకు రెండు పార్టీలు కలిసి ఒక సమన్వయ కమిటీని కూడా నియమించుకున్నాయి. 


ఇటీవల ఢిల్లీలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక విషయాలపై ఇరు పార్టీకి చెందిన నాయకులు ఒక అంగీకారానికి వచ్చారు. ఇక ఆ తర్వాత ఏపీలో హాట్ టాపిక్ గా మారిన అమరావతి ప్రాంత ప్రజలకు, రైతులకు మద్దతుగా నిలవడమే కాకుండా వైసీపీ ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని నిశ్కాయించుకున్నాయి. సమన్వయ కమిటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే నెల రెండో తారీఖున ఈ రెండు పార్టీలు కలిసి లాంగ్ మార్చ్ చేయాలని ముందుగా నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 


కానీ ఏపీలో మారిన పరిస్థితుల నేపధ్యమో, మరో కారణం తెలియదు కానీ ఈ లాంగ్ మార్చ్ ను వాయిదా వేస్తున్నట్లు జనసేన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యక్షుడు నాగభూషణం ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కానీ దీనిపై స్పందించాల్సిన పవన్ మాత్రం సైలెంట్ అవ్వడం వెనుక కారణాలు ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ముందుగా అంగీకారానికి వచ్చిన ఈ రెండు పార్టీలు తల పెట్టిన మొదటి కార్యక్రమం ఇలా  మొదట్లోనే ఆగిపోవడంతో జనసేన బిజెపి ఏపీ నాయకులు ఢీలా పడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: