ఆంధ్రప్రదేశ్ కేంద్రీకరణ బిల్లు శాసన మండలిలో ఆగిపోవడంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి వెళ్లినట్లు తెగ సంబరాలు చేసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలకు మరియు ఎల్లో మీడియా కి శాసనమండలి చైర్మన్ షరీఫ్ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని ప్రాసెసింగ్ లో ఉందని వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీంతో ఇప్పుడు సోమవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.

 

మరోపక్క అధికార పార్టీ వైసిపి పార్టీ నేతలు మాత్రం శాసన మండలి రద్దు చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో శాసన మండలి రద్దు చెయ్యాలి అని వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాలన్న కేంద్రంలో ఉన్న పెద్దలు పర్మిషన్ అవసరం అంటూ వార్తలు వస్తున్న తరుణంలో వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని.. ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ అవసరమని భావించామని.. దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ నేత సునీల్ డియోదర్ రాజధాని అంశంపై బీజేపీతో చర్చించలేదని అంటున్నారని.. బీజేపీతో చర్చించామని తాము ఎప్పుడైనా చెప్పామా అని అంబటి ప్రశ్నించారు.

 

తమ నిర్ణయంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మూడు రాజధానులు, హైకోర్టు ఏర్పాటుపై బీజేపీ నేతల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోకు బీజేపీ నేతలు కట్టుబడి ఉన్నారా లేరా అని అంబటి ప్రశ్నిస్తూ.. బీజేపీ మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించారు. అంతేకాకుండా శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు మరియు చంద్రబాబు వ్యవహరించిన తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టారు అంబటి రాంబాబు. వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా అభివృద్ధి చెందుతారని స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: