ఈరోజు తెల్లవారజామున ప్రాంతంలో సంభవించిన భూకంపం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ముందుగా రెండున్నర గంటల ప్రాంతంలో హైదరాబాదులోని నల్గొండ జిల్లా వద్ద మొట్టమొదటిసారిగా భూగర్భ సర్వే వారు భూకంపం యొక్క తాకిడిని కనుగొనగా అది జరిగిన కొద్ది సేపటికే ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉండే విజయవాడ దగ్గర జగ్గయ్యపేట నగరం నుండి మరొక 27 కిలోమీటర్ల దగ్గర ఇంకొక ప్రకంపనను కనుగొన్నారు. సమయంలో ప్రజలు నిద్రపోతూ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది దీనిని గమనించలేదు. అందులోనూ భూకంపం యొక్క తీవ్రత తక్కువ మోతాదులోనే ఉండడంతో అందరూ సురక్షితంగానే ఉన్నారని సమాచారం.

 

ఇకపోతే సెసిమోగ్రాఫ్ లో హైదరాబాద్ లో వచ్చిన భూకంపం యొక్క తీవ్రత 4.6 గా నమోదవగా విజయవాడ దగ్గర ఉన్న జగ్గయ్యపేట దగ్గర వచ్చిన భూకంపం యొక్క తీవ్రతను 4.4 గా గుర్తించారు. అయితే హైదరాబాదులోని ప్రజలు నగరం నడిబొడ్డు లోని చాలా ప్రాంతాలలో ప్రకంపనలు రావడంతో చాలామంది ఇళ్ళల్లో నుండి బయటకు వచ్చేసి తర్వాత ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. లేకపోతే టర్కీలో దారుణమైన భూకంపం సంభవించిన కొద్దిసేపటికే ఇలా జరగడం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది.

 

ఈభూకంపం నల్గొండ జిల్లాలో మొదలు కాగా దాదాపు 10 మీటర్ల లోతులో ఉన్న దీనిప్రకంపనలు నల్గొండనుండి హైదరాబాదుకి.... ఆ తరువాత విజయవాడకు విస్తరించినట్లు గా భూగర్భనిపుణులు కనుగొన్నారు. రెండు కొండ ప్రాంతంలో ఉన్న మహా నగరాలు కావడం మరియు భూకంప ప్రకంపనలకు అనుగుణంగా వాటీ అమరిక ఉండడమే దీనికి ప్రధాన కారణాలుగా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: