యావత్ తెలంగాణ ప్రజానీకం టీఆర్‌ఎస్‌ పార్టీని ఎంతగా అభిమానిస్తుందో, ఈ పార్టీకి వచ్చిన మెజారిటీని చూస్తే అర్ధం అవుతుంది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన, ఎంతగా ప్రజల్లోకి ప్రచారం ద్వారా పరోక్షంగా పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయాలని చూసిన ఆ పప్పులేవి ఉడకలేదు. ఇకపోతే తెలంగాణాలో జరిగే ప్రతి ఎన్నికల్లో అభ్యర్ధులు చేసే ఖర్చు చూస్తే దిమ్మతిరిగిపోతుంది. ఓటర్ల జేబులో డబ్బులకు, గొంతులో మందు చుక్కలకు ఏమాత్రం లోటులేకుండా చేసారు, నాయకులు.

 

 

కొందరైతే ప్యాకేజీల చొప్పున డబ్బులు పంచగా, మరికొందరు, ఒక వర్గం ఓట్ల కోసం రూ.2.40 లక్షలు ఇచ్చి.. వారి దేవుడిపై ప్రమాణం చేయించుకున్నారు. ప్రజల్లారా మన బాగుకోసం నాయకులను ఎంచుకుంటున్నాం. వారిచ్చే డబ్బుతీసుకుని ఓటేసిన ప్రతి వారు అతను గెలిచాక, అతని దగ్గరికి వెళ్లి నీ కాలనీ సమస్యను గానీ, నీ సమస్యను తీర్చమని అడిగే హక్కు నీకు ఎక్కడ ఉంటుంది.

 

 

ఒక్క సారి ఆలోచించండి. మీరు ఓటు పుక్కడికి వేయలేదు. అతను మీ ఓట్లకు రేటుకట్టి కొన్నాడు. ఒకరకంగా అతను ఓటర్ల మీద పెట్టుబడి పెట్టాడు. ఆ పెట్టుబడి రాబట్టడానికి అవినీతి మార్గంలోనే ప్రయాణిస్తాడు గాని, మీతో న్యాయంగా వ్యవహరించి ఈ బ్రతుకులు బాగు చేస్తాడని ఆశించడం తప్పు. అందుకే నాయకుల్ని తిట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే, చాల మంది ఎలక్షన్స్ అయినాక వీడు గెలి అది చేస్తా అన్నాడని, నోటికొచ్చిన తిట్లు తిట్టడం కామన్ అయింది. ముందు ఓటర్లు మారాలి. నోటు తీసుకోకుండా ఓటు వేస్తే గల్ల పట్టి నలుగురిలోకి లాగి అడిగే హక్కు ఉంటుంది.

 

 

కానీ నోటు జేబులో వేసుకుని, గెలిన నాయకులను ప్రశ్నించే అధికారాన్ని కోల్పోయారు ఓటర్లు.. ఇకపోతే టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచి ఒక్క రోజుకూడా కాలేదు. అప్పుడే ప్రజల మీద భారం వేయడానికి గులాభి బాస్ పావులు కదుపుతున్నాడట. ఇప్పటికే వంద యునిట్ కంటే ఒక్క యూనిట్ ఎక్కువైనా డబుల్ బిల్ల్ వసూలు చేస్తున్న ప్రభుత్వం, త్వరలో ఇంటి పన్నులు కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

 

 

అదీ కాకుండా టీఆర్‌ఎస్‌ను గెలిపించిన ఫలితం ప్రజలు వెంటనే అనుభవిస్తారంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించిన గంటల వ్యవధిలోనే ఇంటి పన్నులు పెరుగుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలు వద్దని చెబుతున్నా వినకుండా టీఆర్‌ఎస్‌కు ఓట్లేశారని.. దాని ఫలితం వెంటనే అనుభవిస్తారని ఎద్దేవా చేశారు.

 

 

అతి తొందర్లో విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్నులు పెరుగుతాయని ఆయన హెచ్చరించారు. ఎవరు ఎన్ని చెప్పిన వినని ప్రజలకు అనుభవించిన గాని జ్ఞానోదయం కాదు. ఇప్పటికే భావి తరాల భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టేలా తయారవుతున్న వ్యవస్దను మార్చాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: