తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో 31 మున్సిపాలిటీలలో, 5 కార్పొరేషన్లలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. 28 మున్సిపాలిటీలలో, 5 కార్పొరేషన్లలో హంగ్ ఫలితాలు వచ్చాయి. ఎక్స్ అఫీషియో ఓటు ఇక్కడ కీలకం కానుంది. హంగ్ ఫలితాలు వచ్చిన వాటిలో మెజారిటీ స్థానాలలో టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర పార్టీలతో పొత్తులు, స్వతంత్రులు కొన్ని చోట్ల ఫలితాలు నిర్ణయించనున్నాయి. 
 
మిగతా ప్రాంతాలతో పోలిస్తే నిజమాబాద్ లో మ్యాజిక్ ఫిగర్ ను మజ్లిస్ - టీఆర్‌ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ దాటలేకపోయింది. అందువలన ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. రామగుండం కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. రామగుండం కార్పొరేషన్ లో టీఆర్‌ఎస్ పార్టీ 18 సీట్లు గెలుచుకోగా, 11 సీట్లలో కాంగ్రెస్, 6 సీట్లలో బీజేపీ, 15 మంది ఇతర స్థానాల్లో విజయం సాధించారు. 
 
రామగుండం కార్పొరేషన్ లో ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది. 32 డివిజన్లు ఉన్న బడంగ్ పేట్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్ పార్టీ 13 సీట్లలో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ 7 సీట్లలో, బీజేపీ పార్టీ 10 సీట్లలో గెలిచింది. ఇతరులు రెండు చోట్ల గెలిచారు. ఏ రెండు పార్టీలైనా పొత్తు పెట్టుకుంటే మాత్రమే ఇక్కడ పాలకమండలి ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది. 
 
46 డివిజన్లు ఉన్న మీర్ పేట్ కార్పొరేషన్ లో మ్యాజిక్ ఫిగర్ 24 కాగా 19 చోట్ల టీఆర్‌ఎస్ పార్టీ 16 చోట్ల బీజేపీ పార్టీ విజయం సాధించాయి. 3 సీట్లలో కాంగ్రెస్ గెలుపొందగా 8 స్థానాలలో ఇతరులు విజయం సాధించారు. ఇక్కడ కూడా పొత్తులు తప్పనిసరి కానున్నాయి. 28 డివిజన్లు ఉన్న బోడుప్పల్ లో మ్యాజిక్ ఫిగర్ 15 కాగా టీఆర్‌ఎస్ పార్టీ 14, కాంగ్రెస్ 7, ఇతరులు 5 చోట్ల , బీజేపీ 2 చోట్ల విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోని 31 మున్సిపాలిటీలలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: