రాష్ట్రంలోని గ్రామాల ప్రజలు ఏ పనులు కావాలన్నా చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఏ చిన్న పని జరగాలన్న మండల కేంద్రానికి వెళ్లాల్సిందే ఎందుకంటే మండల కేంద్రంలో మీ సేవ కేంద్రం లాంటి సదుపాయాలు ఉంటాయి. అదే గ్రామాల్లో అయితే అలాంటి సదుపాయాలు ఎక్కడ..? రాను పోను ఖర్చులు ఎన్నైనా... అవస్థలు పడుతూనే ప్రయాణం చేస్తూ ఉంటారు గ్రామస్తులు. కాగా ఇప్పటికే పేద ప్రజల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్ మరోసారి పేద ప్రజలకు ఇబ్బంది పడకుడదనే ఉద్దేశంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక  మీకు కావాల్సిన సేవల కోసం  మీసేవా కేంద్రాలకు వెళ్లి కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయం లో 536 రకాల సేవలను మొదలు కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని కుగ్రామాలు సహా తండాలలో  మొత్తం 15002 గ్రామ వార్డు సచివాలయం లో ఈ సేవలు అందించనున్నారు. 

 

 

 

 పొలం పాస్ బుక్లో భూముల వివరాలు నమోదు,  ఈసీల జారి,  కుల దృవీకరణ పత్రాలు,  రేషన్ కార్డు లో మార్పులు చేర్పులు వంటి వాటికోసం  ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ తిరిగేవారు. అయినప్పటికీ పని జరగడానికి మాత్రం చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు మాత్రం 15 నిమిషాల వ్యవధిలోనే వన్ బి  అడంగల్, రేషన్ కార్డు ప్రింట్, టైటిల్ డిడ్,  రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సర్టిఫికెట్ కాపీ, విద్యుత్ కనెక్షన్ కేటగిరి మార్పు లాంటి సేవలను గ్రామ సచివాలయం లోనే పొందవచ్చు. ఇప్పటికి నలభై ఏడు రకాల సేవలను అందిస్తుండగా మరో 148 రకాల సేవలను మూడు రోజుల వ్యవధిలోనే పరిష్కరించేలా జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మరిన్ని సేవలు నిర్ణీత సమయంలో పరిష్కారం అయ్యేలా చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీనికితోడు గ్రామ వార్డు సచివాలయం లో నిత్యం స్పందన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు అధికారులు. 

 

 

 

 ఇక కుగ్రామాలు తండాలలో సచివాలయంలోని ఎన్నో సేవలు అందుబాటులోకి వస్తుండడంతో ప్రతిచోటా కంప్యూటర్లు ప్రింటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు అధికారులు. ప్రింట్ తీసిన అనంతరం దరఖాస్తుదారులు అందరికీ లామినేషన్ చేసిన కార్డులను అందించేలా చర్యలు చేపట్టారు. దీనికోసం ఇప్పటికే 2.81 లక్షల మంది వాలంటీర్లకు మొబైల్ ఫోన్ సిమ్ కార్డులను ఇప్పటికే పంపిణీ చేసింది ప్రభుత్వం. దీంతో ఇన్ని రోజుల వరకు గ్రామాల్లో ఉండి ఆయా సేవలకోసం మీసేవ సెంటర్లకు వెళ్లి కాళ్లరిగేలా తిరిగినా ప్రజలందరికీ జగన్ సర్కార్ నూతన నిర్ణయంతో ఎంతో మేలు చేకూరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: