మండలిలో బలం పెంచుకోవడానికి వైకాపా ప్రయత్నం చేస్తున్నది.  అయితే, మండలిలో బలం పెంచుకునే సమయంలో అనేక ఎత్తులు వేయబోతున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయం రుజువైంది.  వైకాపాకు మండలిలో పెద్దగా బలం లేదు.  ఆ పార్టీకి కేవలం 9 మంది మాత్రమే బలం ఉన్నది.  ఈ బలాన్ని దాటేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మండలిలో మూడు రాజధానుల బిల్లుకు చుక్కెదురు కావడంతో ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచనలో పడింది.

 
మూడు రాజధానులను ఏర్పాటు చేసుకొని దానికి తగినట్టుగా అన్నింటిని సిద్ధం చేసుకోవాలని చూసిన వైకాపాకు మండలి షాక్ ఇవ్వడంతో షాక్ అయ్యింది.  ఇందులో భగంగా మండలిని రద్దు చేయాలని అనుకున్నారు.  కానీ, ఈ రద్దు వ్యవహారం ఫలించలేదు.  రద్దు చేస్తారా లేదా అనే విషయం ఇప్పటి వరకు తేలలేదు.  రేపు సభలో దీనిపై చర్చించబోతున్నారు.  ఫైనల్ గా డెసిషన్ తీసుకోబోతున్నారు.  మండలిని రద్దు చేస్తే తెలుగుదేశం పార్టీకి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు.  


కానీ,వైకాపాకు మాత్రం చాలా వరకు దెబ్బపదే అవకాశం ఉన్నది.  అదెలా అంటే వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత చాలామందికి ప్రభుత్వం హామీ ఇచ్చింది.  ఆశావహులకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని చెప్పింది.  ఇప్పటికే మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.  ఆ మూడు వైకాపాకు సొంతం అవుతాయి.  అలానే మరో రెండేళ్లలో 19 సీట్లు ఖాళీ అవుతాయి.  వాటిని కూడా వైకాపా సొంతం చేసుకుంటుంది.  అయితే, ఇప్పటికిప్పుడు బలం లేదు కాబట్టి రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం అది పొరపాటే అవుతుంది.  


అందుకోసమే తెలుగుదేశం పార్టీ నేతలకు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.  నయానో భయానో వారిని ఒప్పించి పదవుల నుంచి తప్పించాలని చూస్తున్నారు.  పదవి నుంచి తప్పుకుంటే రూ. 5 కోట్ల రూపాయల వరకు డబ్బు ముట్టజెబుతామని అంటున్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండనే విషయం చూడాల్సి ఉంటుంది.  ఒకవేళ ఇది నిజమే అయితే, గతంలో బాబు ప్రభుత్వం ఎమ్మెల్సీ విషయంలో ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగానే, ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఎమ్మెల్సీ విషయంలో అదే విధంగా ఖర్చు చేయబోతున్నదన్నమాట.  

మరింత సమాచారం తెలుసుకోండి: