ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ కాదు. చాలా మంది డబ్బు ఉంటే చాలు.. ఎన్నికల్లో సింపుల్ గా గెలవచొచ్చు అనుకుంటారు. డబ్బుంటే ఎన్నికల్లో గెలుపు కాస్త సులభం అవుతుందేమో కానీ.. కేవలం డబ్బు వల్లే గెలవడం ఉండదు. ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లు ఆకట్టుకోవాలి. అందుకు ఎన్నో జిమ్మిక్కులు చేయాలి. ఎన్నో ఎత్తులు వేయాలి.

 

అంతటితో ఆగుతుందా.. మనమంటే ఇష్టం ఉన్నావారిని కూడా కుదిరితే నజరానా ఇవ్వాలి. పోలింగ్ బూత్ వరకూ తీసుకెళ్లాలి.. ఇలా చేయాల్సినవి ఎన్నో ఉంటాయి. మరి ఈ టాలెంట్ లేకపోతే ఓట్లు రాలవు. కానీ నిజాంపేట నగర పాలక సంస్థలో శనివారం వెలువడిన ఫలితాల్లో పలు విచిత్రాలు చోటుచేసుకున్నాయి. స్వతంత్రులుగా బరిలోకి దిగిన పలువురు అభ్యర్థులకు ఒకటి, రెండేసి చొప్పున ఓట్లు కూడా వచ్చాయి.

 

మరీ విచిత్రం ఏంటంటే.. ఒక అభ్యర్థికి సున్నా ఓట్లు వచ్చాయి. ఇంతకీ ఎవరతను అంటారా.. ప్రగతినగర్‌లోని 2వ వార్డు నుంచి బరిలోకి దిగిన నల్లగట్ల భాస్కరా చారికి ఒక్క ఓటు కూడా రాలేదు. అదేంటి ఎంతగా ఇబ్బంది పడినా.. తన ఓటైనా తాను వేసుకుని ఉంటాడుగా అంటారా.. బహుశా అతనిది పక్క వార్డు అయ్యుండొచ్చు.

 

ప్రగతి నగర్ లోని 10వ వార్డు నుంచి బరిలో నిలిచిన తులసి అశోక్, కె.సునీలు, 24వ వార్డు నుంచి పోటీ చేసిన కె.బాలసుబ్బమ్మకు కూడా కేవలం ఒక్క ఓటు మాత్రమే పోలైంది. అంటే కనీసం వీరు తమ ఓటైనా తమకు వేసుకున్నారు. మరి వారి కుటుంబాల్లోని మిగతా సభ్యులు ఎందుకు ఓటేయలేదని కామెంట్ చేస్తున్నారు. ప్రగతి నగర్ 7వ వార్డు అభ్యర్థి బి. సుశీలాదేవి, 11వ వార్డు నుంచి పి.ప్రతాప్ రెడ్డి, అయిదో వార్డు నుంచి బరిలోకి దిగిన అల్లంరాజు వెంకట రమణమూర్తికి రెండు చొప్పున ఓట్లు వచ్చాయి. మరి ఇంతగా అట్టర్ ఫ్లాప్ అయ్యారంటే.. ఇక వీరి టాలెంట్ ఏంటో మీరే అంచనా వేసుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: