ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నాసరే.. సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాత్రం లోటు రానీయడం లేదు. అంతే కాదు.. అనేక ప్రభుత్వ సేవలను కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే విద్యావాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన జగన్ ఇప్పుడు వాటిని బాగా సద్వినియోగం చేసుకుంటున్నాడని చెప్పాలి.

 

ఇక తాజాగా జగన్ రిపబ్లిక్ డే కానుకగా మరో వరం అందిస్తున్నారు. అదే.. సేవల వరం. ఈ రోజు నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో 470 పౌర సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 వేలకు పైగా సచివాలయల్లో ప్రజల నేటి నుంచి ఈ సేవలను ఉపయోగించుకునేలా జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఏయే సేవలను ఎన్ని గంటల్లో, రోజుల్లో అందించాలన్న విషయంపైనా సేవా పట్టికలు రెడీ చేసేశారు.

 

ఏదైనా ఫిర్యాదుతో వస్తే.. అత్యధికంగా 72 గంటల్లో సేవలు అందేలా కార్యాచరణ రూపొందించారు. 11 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 540 సేవలను ప్రజలకు అందించాలన్నది సచివాలయాల ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం. అయితే ప్రస్తుతం రుసుములు చెల్లించనవసరం లేని సేవలు వెంటనే లభ్యమవుతున్నాయి.

 

ఇక రుసుములు చెల్లించే సేవలు కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. ఇవి ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. రుసుం చెల్లించే 70 సేవలు మినహా 470 సేవలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇలా ప్రజలకు తక్కువ సమయంలోనే.. తక్కువ ధరలకు అవసరమైన అన్ని పనులూ చేసేలా ప్రభుత్వ విభాగాలు పని చేస్తే.. చాలా బావుంటుంటారు ముఖ్యమంత్రి. అసలు ప్రభుత్వాసుపత్రుల్లో డబ్బు చెల్లిస్తేనే పనులు కాని రోజులు ఉన్నాయి. మరి అలాంటి వారిపై కేసీఆర్ దృష్టి పెడతారా. లేదా అన్నది వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: