ఏపీ సీఎం జగన్ బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎంల జబితాలో నాలుగో స్థానాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రుల జాబితాలో ముందువరసలో నిలిచారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సీఎంగా జగన్ ఖ్యాతి గడించారు. ప్రముఖ వార్తా సంస్థలలో ఒకటైన ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో జాతీయ స్థాయిలో పోల్ సర్వేను నిర్వహించింది. 
 
సర్వే ఫలితాలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ మొదటి స్థానంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రెండో స్థానంలో, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు. ఏపీ సీఎం జగన్ జాతీయ స్థాయిలో నాలుగవ స్థానంలో నిలిచారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉండటంతో జగన్ కు నాలుగో స్థానం దక్కింది. 
 
కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో సీఎం కేసీఆర్ కు మాత్రం షాక్ తగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత పలు సర్వేలలో కేసీఆర్ బెస్ట్ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కేసీఆర్ పార్టీని రికార్డు స్థాయి సీట్లలో గెలిచేంత గొప్పగా ప్రజా సంక్షేమ పాలన, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 
 
కానీ కేసీఆర్ మాత్రం టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో వెనుకబడ్డారు. సీఎం జగన్ 4వ స్థానంలో ఉండగా 5వ స్థానంలో మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, 5వ స్థానంలోనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని 6వ స్థానంలో, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ 7వ స్థానంలో నిలిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: