ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా దేనికోసం ఆతృతగా ఎదురు చూస్తారో తెలుసా? ఇంక దేనికోసం పెళ్లి కోసమే.  ప్రతి యువకుడు యువతి కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుందామా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు.  పెళ్లి చేసుకోవడంలో ఉండే మజా మరెందులోను ఉండదు.  పెళ్లి తరువాత మనిషి లైఫ్ మారిపోతుంది.  అందుకే పెళ్లి కోసం ఎక్కువగా ఆరాట పడుతుంటారు.  ఎక్కువ ఆరాటం ఎందుకో తెలుసు.  ఎక్కువ ఆందోళన ఎందుకోసమో కూడా తెలుసు.  


మనదేశంలో పెళ్లి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.  పెళ్లి తరువాత జరిగే శోభనం తంతును కూడా అద్భుతంగా నిర్వహిస్తారు.  తొలిరాత్రి ఆ పండగ కోసం ఎంతగా ఎదురు చూస్తారో చెప్పక్కర్లేదు.  అయితే, తొలిరేయిలో జరిగే విషయాలు అందరికి మంచి చేస్తుంటాయి.  ఓ ప్రాంతంలో మాత్రం వాటిని తలచుకుంటేనే భయపడిపోతుంటారు.  అలాంటి విషయాలు అసలు పట్టించుకోకూడదు అని చెప్పి ఇబ్బందులు పడుతుంటారు.  


అది దేశం కాదు.  ఓ ప్రాంతం.  మూడు దేశాలకు చెందిన ఓ చిన్న దీవి అది.  అక్కడ గిరిజన తెగకు సంబంధించిన వ్యక్తులు నివసిస్తుంటారు.  అక్కడ పెళ్లిని ఆచారంగా నిర్వహిస్తారు.  పెళ్లి తరువాత జరిగే శోభనం రోజున వధూవరులను ఇద్దరిని గదిలోకి పంపి గతి బయట లాక్ చేస్తారు.  మూడు రోజులపాటు ఆ గదిలోనే భార్యాభర్తలు ఉండాలి.  కనీసం మూత్రవిసర్జనకు కూడా బయటకు రాకూడదు.  ఆలా వస్తే నేరం అవుతుంది.  వాళ్ళ ఆచారం ప్రకారం మూత్ర విసర్జనకు బయటకు రావడం మహా నేరం.  పాపం కూడా.  


శోభనం తరువాత మూడు రోజుల పాటు మలమూత్రాలకు వెళ్లకుండా లోపలే ఉండటం అంటే ఎంత దారుణమైన విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు.  ఎంతగా ఇబ్బందులు పడతారో కూడా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇలా ఎందుకు చేస్తారు అంటే, దానికి చాలా కారణాలు ఉన్నాయట.  అలా చేయడం భార్యాభర్తలు హ్యాపీగా ఉంటాయని, వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు రావని అంటున్నారు.  అంతేకాదు, పుట్టబోయే పిల్లలు కూడా బాగుంటారని అంటున్నారు.  మూడు రోజులు మలమూత్రాలను అదుపులో ఉంచుకోవాలని చెప్తారట.  ఇదెక్కడి గొడవండి బాబు మూడు రోజులు ఎలా దాచుకుంటారు.  అదేమన్నా బంగారమా చెప్పండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: